Asianet News TeluguAsianet News Telugu

ఉగ్రవాదులకు సహకరిస్తున్న 9 వేర్పాటువాద సంస్థలు.. భారత్ చేసిన అభ్యర్థనలను విస్మరించిన కెనడా..

ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యను భారత్‌కు కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ముడిపెట్టడంతో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినే స్థాయి చేరుకున్నాయి. అయితే కెనడాలో స్థావరాలను కలిగి ఉన్న ఉగ్రవాద గ్రూపులకు మద్దతిచ్చే వేర్పాటువాద సంస్థలపై చర్య తీసుకోవాలని భారత్ చేసిన అభ్యర్థనను కెనడా పదే పదే పట్టించుకోలేదని భారత అధికారులు తాజాగా వెల్లడించారు.

Canada Ignored India Requests To Extradite Terrorists says officials ksm
Author
First Published Sep 20, 2023, 10:38 AM IST

న్యూఢిల్లీ: ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యను భారత్‌కు కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ముడిపెట్టడంతో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినే స్థాయి చేరుకున్నాయి. ఈ క్రమంలోనే భారత్, కెనడాల మధ్య సంబంధాల విషయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కెనడా ప్రధాని చేసిన వ్యాఖ్యలను భారతదేశం తిరస్కరించింది. ఈ విషయం తీవ్రత కారణంగా ప్రపంచ దృష్టిని సైతం ఆకర్షించింది. అయితే కెనడాలో స్థావరాలను కలిగి ఉన్న ఉగ్రవాద గ్రూపులకు మద్దతిచ్చే వేర్పాటువాద సంస్థలపై చర్య తీసుకోవాలని భారత్ చేసిన అభ్యర్థనను కెనడా పదే పదే పట్టించుకోలేదని భారత అధికారులు తాజాగా వెల్లడించారు.

టెర్రర్ గ్రూపులకు మద్దతిచ్చే కనీసం తొమ్మిది వేర్పాటువాద సంస్థలు కెనడాలో తమ స్థావరాలను కలిగి ఉన్నాయని అధికారులను ఉటంకిస్తూ ఓ వార్తా సంస్థ నివేదించింది. అనేక బహిష్కరణ అభ్యర్థనలు ఉన్నప్పటికీ.. కెనాడా ఘోరమైన నేరాలకు పాల్పడిన వారిపై ఎటువంటి చర్య తీసుకోలేదని పేర్కొంది. ఇక, ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మూస్ వాలా హత్యతో సహా నేరాల్లో కూడా ఈ సంస్థల ప్రమేయం ఉంది.

హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించి భారత్‌పై కెనడా చేస్తున్న ఆరోపణలు నిరాధారమైన కేంద్ర ప్రభుత్వ అధికారులు వర్గాలు తెలిపాయి. వాంటెడ్ టెర్రరిస్టులు,  గ్యాంగ్‌స్టర్ల బహిష్కరణ అంశాన్ని భారత అధికారులు బహుళ దౌత్య, భద్రతా చర్చలలో లేవనెత్తారని వారు చెప్పారు. అయితే కెనడా మాత్రం ఈ టెర్రర్ ఎలిమెంట్స్‌కు మద్దతుగా నిబద్ధత లేకుండా, నిస్సంకోచంగా ఉండిపోయిందని పేర్కొన్నారు.  అ

‘‘కెనడా వైపు అనేక పత్రాలు అందజేసినప్పటికీ భారతదేశం బహిష్కరణ అభ్యర్థనలు పరిష్కరించబడలేదు. ఉగ్రవాద కార్యకలాపాల్లో పాలుపంచుకున్న కనీసం ఎనిమిది మంది వ్యక్తులు, పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఐఎస్‌ఐతో కలిసి కుట్రపన్నుతున్న పలువురు గ్యాంగ్‌స్టర్లు కెనడాలో సురక్షిత స్వర్గధామాన్ని కనుగొన్నారు’’ అనిఅధికారులు తెలిపారు.

ఈ వ్యక్తుల బహిష్కరణ అభ్యర్థనల విషయానికి వస్తే..  1990ల ప్రారంభంలో ఉగ్రవాద కార్యకలాపాలలో పాల్గొన్న గుర్వంత్ సింగ్‌తో సహా పలు అభ్యర్థనలు కెనడా అధికారుల వద్ద చాలా సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్నాయని వారు తెలిపారు. అతనిపై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు కూడా పెండింగ్‌లో ఉందని  గుర్తుచేస్తున్నారు. 

గురుప్రీత్ సింగ్‌తో సహా తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న వ్యక్తులను బహిష్కరించాలని భారత అధికారులు పదేపదే కెనడాను అభ్యర్థించారు. అతని కెనడా చిరునామాను అందించారు, కానీ ఎటువంటి చర్య తీసుకోలేదు. అదేవిధంగా..16 క్రిమినల్ కేసుల్లో వాంటెడ్ గా ఉన్న అర్ష్‌దీప్ సింగ్ అలియాస్ అర్ష్ దల్లా, ప్రఖ్యాత పంజాబీ గాయకుడు సిద్ధూ మూస్ వాలా హత్యకు బాధ్యత వహించిన సతీందర్‌జిత్ సింగ్ బ్రార్ అలియాస్ గోల్డీ బ్రార్ వంటి పేరుమోసిన గ్యాంగ్‌స్టర్లను బహిష్కరించాలని అభ్యర్థనలు గణనీయమైన ఆధారాలతో సమర్పించబడ్డాయి. అయితే కెనడా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు.

వేర్పాటువాద సంస్థ బహిరంగంగా హత్య బెదిరింపులను జారీ చేసింది. వేర్పాటువాద భావాలను ప్రేరేపించింది. భారతదేశంలో లక్ష్యంగా చేసుకున్న హత్యలను ప్రోత్సహిస్తుంది. ఖలిస్థాన్ అనుకూల అంశాలతో అనుబంధంగా ఉన్న కెనడాకు చెందిన గ్యాంగ్‌స్టర్ ప్రముఖ గాయకుడు సిద్ధూ మూస్ వాలాను హత్య చేయడం దీనికి స్పష్టమైన ఉదాహరణ.

కెనడాలో ఉన్న ఇతర వాంటెడ్ టెర్రరిస్టులలో ఖలిస్తాన్‌లోని దశమేష్ రెజిమెంట్‌కు చెందిన గుర్వంత్ సింగ్ బాత్, భగత్ సింగ్ బ్రార్ (పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాది లఖ్‌బీర్ సింగ్ రోడ్ కుమారుడు), మొనీందర్ సింగ్ బుల్, సతీందర్ పాల్ సింగ్ గిల్ ఉన్నారు.

కెనడా అధికారులు నిజ్జర్ హత్యతో భారతీయ అధికారుల ప్రత్యక్ష సంబంధాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమయ్యారని అధికారులు పేర్కొన్నారు. మరో కెనడా పౌరుడు రిపుదమన్ మాలిక్ హత్యను కూడా వారు ఉదహరించారు. అతడు.. సత్నాం రిలిజియస్ ప్రచార సంఘం (ఎస్‌ఆర్‌పీఎస్) ద్వారా శ్రీ గురు గ్రంథ్ సాహిబ్‌ను ముద్రించినందుకు న్యాయం కోసం నిజ్జర్, సిక్కుల ఆగ్రహానికి గురయ్యారు. కొన్ని రోజుల తర్వాత అతడిని గుర్తు తెలియని దుండగులు హతమార్చారు. హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వివిధ సమూహాల మధ్య అంతర్గత స్పర్ధల ఫలితమేనని భారత అధికారులు పేర్కొంటున్నారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios