Asianet News TeluguAsianet News Telugu

మూడు కళ్ళు, నాలుగు ముక్కు రంధ్రాలతో పుట్టిన దూడ.. దైవస్వరూపం అంటూ పూజలు...

ఓ దూడ పిల్ల మూడు కళ్లతో జన్మించింది. ఈ వార్త ఆ నోటా, ఈ నోటా చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించింది. దీంతో ఈ వింతను చూడటానికి జనం ఎగబడుతున్నారు. చత్తీస్గఢ్ లోని రాజ్ నందగావ్ జిల్లా గండాయ్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ రైతుకు చెందిన ఆవు ఈ దూడకు జన్మనిచ్చింది. దూడకు మూడు కళ్ళు, నాలుగు ముక్కు రంధ్రాలు ఉన్నాయి.

calf born with three eyes, 4 nozzle holes in chhattisgarh
Author
Hyderabad, First Published Jan 18, 2022, 9:32 AM IST

ఛత్తీస్ గఢ్ : కుక్క కడుపున ఏనుగు పిల్ల.. ఏనుగు కడుపులో పంది పిల్ల.. ఇలా వింత వింత జనాలకు సంబంధించిన వార్తలు అప్పుడప్పుడూ వింటూనే ఉంటాం. అలాంటి జంతువులను చూసినప్పుడు ఆశ్చర్యంగా ఉంటుంది. అయితే ఇలాంటి వింత జంతువుల్లో బతికేవి చాలా తక్కువగా ఉంటాయి. ప్రస్తుతం ఇలాంటి వింత జననం ఒకటి ఛత్తీస్ గఢ్ లో చోటుచేసుకుంది.

ఓ దూడ పిల్ల మూడు కళ్లతో జన్మించింది. ఈ వార్త ఆ నోటా, ఈ నోటా చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించింది. దీంతో ఈ వింతను చూడటానికి జనం ఎగబడుతున్నారు. చత్తీస్గఢ్ లోని రాజ్ నందగావ్ జిల్లా గండాయ్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ రైతుకు చెందిన ఆవు ఈ దూడకు జన్మనిచ్చింది. దూడకు మూడు కళ్ళు, నాలుగు ముక్కు రంధ్రాలు ఉన్నాయి. దీనికితోడు దాని తోక, నాలుక కూడా మిగతా దూడల్లా కాకుండా విచిత్రంగా ఉన్నాయి. 

ఈ నెల 13వ తేదీన ఈ వింత దూడ పుట్టడంతో పూజలు చేసేందుకు మహిళలు క్యూ కడుతున్నారు. దూడను చూసినవారంతా భగవంతుని స్వరూపం అంటూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆవు కడుపులోని పిండం అభివృద్ధి చెందకపోవడం వల్ల ఇలా జరుగుతుందని.. ప్రస్తుతం దూడ ఆరోగ్యంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. 

ఇదిలా ఉండగా, నిరుడు సెప్టెంబర్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో ఇలాంటి వింతే జరిగింది. కొన్నిసార్లు జరిగే విచిత్రాల్లో ఇది ఒకటి. సాధారణానికి భిన్నంగా కొన్ని వింతలు చోటు చేసుకుంటాయి. అలాంటి వాటికి జన్యులోపాలో, మరే ఇతర విషయాలో కారణం అయి ఉంటాయి. కాకపోతే అలాంటి వింతలు, విచిత్రాలు వార్తా విశేషాలుగా మారతాయి. 

అలాంటి విచిత్ర ఘటనే కృష్ణా జిల్లా పామర్రులో చోటు చేసుకుంది. ఇక్కడి యాదవపురానికి చెందిన గోపాలకృష్ణ అనే వ్యక్తి దగ్గరున్న ఓ గేదె చూడిదయ్యింది. అయితే చూడి కట్టి 10 నెలలు అవుతున్నా ఈనలేదు. దీంతో అనుమానం వచ్చి గేదెను పశువైద్యుడి దగ్గరికి తీసుకువెళ్లాడు గోపాలకృష్ణ.

దీంతో పశువైద్యుడు శశికుమార్ ఆ గేదెను పరీక్షించారు. ఈ పరీక్షల్లో గేదె కడుపులో ఉన్న దూడ ఆకృతి మామూలుగా లేదని... తేడా ఉందని దీనివల్లే కాన్పు ఆలస్యం అవుతోందని గమనించాడు. దీంతో వెంటనే గేదెకు శస్త్రచికిత్స చేసి దూడను బైటికి తీశారు. 

ఈ దూడను చూసి అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. ఎందుకంటే ఈ దూడకు 2 తలలు, 6 కాళ్లు ఉన్నాయి. అయితే ఇలా విచిత్ర రూపంలో పుట్టిన జీవులు బతకడం చాలా అరుదు. అలాగే రెండు తలలు, నాలుగు కాళ్లతో పుట్టిన ఈ దూడ కూడా పుట్టిన కాసేపటికే మృతి చెందింది.

Follow Us:
Download App:
  • android
  • ios