రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. ఆరు రబీ పంటలకు కనీస మద్దతు ధర పెంపు..

దేశంలోని రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈరోజు జరిగిన కేంద్ర మంత్రివర్గం  రబీ లేదా శీతాకాలపు పంటలకు కనీస మద్దతు ధరను(ఎంఎస్‌పీ) పెంచుతూ నిర్ణయం తీసుకుంది.  

Cabinet Approves MSP Hike For 6 Rabi Crops ksm

దేశంలోని రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈరోజు జరిగిన కేంద్ర మంత్రివర్గం  రబీ లేదా శీతాకాలపు పంటలకు కనీస మద్దతు ధరను(ఎంఎస్‌పీ) పెంచుతూ నిర్ణయం తీసుకుంది.  ఆరు పంటలకు ఎంఎస్‌పీ ధరలను 2 నుంచి 7 శాతం వరకు పెంచనున్నట్టుగా ప్రకటించింది. 2024-25 మార్కెటింగ్ సీజన్‌కు గానూ గోధమల కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ. 150 పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. గోధమలు క్వింటాలుకు ప్రస్తుతం రూ. 2,125 ఉండగా.. ఇప్పుడు దానిని రూ. 2,275గా నిర్ణయించింది.

కందులు క్వింటాల్‌కు రూ. 425 పెంచింది. ప్రస్తుతం కందులు క్వింటాలుకు రూ. 6,000 ఉండగా దానిని రూ. 6,425 గా నిర్ణయించింది. బార్లీ ఎంఎస్‌పీ ధర ప్రస్తుతం ఉన్న ధరతో పోలిస్తే క్వింటాల్‌కు రూ. 115 పెరిగి రూ.1,850కి చేరింది. శెనగలు క్వింటాలుకు రూ. 105 పెరిగి రూ.5,440కి చేరింది. ఆవాలు క్వింటాల్‌కు రూ. 200 పెరిగి 5,650గా చేరింది. సన్‌ఫ్లవర్‌పై రూ. 150 పెరిగి రూ. 5880కి చేరింది. 

ఇక, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కార్ దసరా కానుకను ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నాలుగు శాతం డీఏ పెంపునకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏను 42 నుండి 46 శాతానికి పెంపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 7వ సెంట్రల్ పే కమిషన్  సిఫారసుల ఆధారంగా  కేంద్ర కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా  కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం కలగనుంది. ఈ నిర్ణయం కారణంగా సుమారు 47 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు,  68 లక్షల మంది పెన్షనర్లకు లబ్ది కలగనుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios