Asianet News TeluguAsianet News Telugu

టార్గెట్ 2024: కాంగ్రెస్‌కు కత్తిమీద సామేనా? బలపడ్డ స్థానిక పార్టీలు.. అపోజిషన్ యూనిటీ వట్టిమాటేనా?

వచ్చే సార్వత్రిక ఎన్నికలు కాంగ్రెస్‌కు కత్తిమీద సాములా మారేలా ఉన్నాయి. తాజా ఉపఎన్నికల్లో స్థానిక పార్టీలు సత్తా చాటాయి. చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రాబల్యం తగ్గి.. స్థానిక పార్టీల ప్రభావం పెరుగుతున్నది. ఈ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కంటే స్థానిక పార్టీలే మెరుగైన ప్రదర్శన కనబరిచాయి. గోవాలో టీఎంసీ పూర్తిస్థాయిలో పోటీ చేయడానికి నిర్ణయించుకోవడంతో ఇప్పటి వరకు చర్చలో ఉన్న విపక్షాల ఐక్యత సాధ్యమయ్యేనా? అనే అనుమానాలూ పెరుగుతున్నాయి.
 

bypolls put congress in tough situation ahead of general elections
Author
New Delhi, First Published Nov 4, 2021, 5:28 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

న్యూఢిల్లీ: BJP, Congress పార్టీలు ఇప్పటికే 2024 Genral Elections కోసం వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. రెండు సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి బీజేపీ క్షేత్రస్థాయిలో బలపడ్డది. 2014 నుంచి కాంగ్రెస్ చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబరచలేదు. కానీ, ఈ సారి ఎలాగైనా కేంద్రంలో అధికారం సాధించి తీరాలని యోచిస్తున్నది. ఇందుకోసం మిగతా ప్రతిపక్ష పార్టీల సహకారం తీసుకోవాలని ఆలోచిస్తున్నది. కానీ, తాజాగా దేశవ్యాప్తంగా పలురాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ Bypolls ఫలితాల నేపథ్యంలో  రాజకీయ విశ్లేషణలు  మారుతున్నాయి. ఇది వరకు Oppositions ఆలోచిస్తున్న ఐక్యత కార్యరూపం దాల్చేనా? అనే అనుమానాలు తెర మీదకు వచ్చాయి. 

బీజేపీకి Uttar Pradesh కీలక రాష్ట్రం. ఈ రాష్ట్రంలోని 80 ఎంపీ సీట్లలో 60కిపైగా ఎన్‌డీఏ గెలుచుకుంది. అంతుకు ముందు 71 స్థానాలనూ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నది. కేంద్ర క్యాబినెట్‌లో యూపీకి ప్రాతినిధ్యం పెంచడంతోపాటు అయోధ్య రామమందిర నిర్మాణం వేగవంతం చేయడం, అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడం వంటి హడావిడీ చేస్తున్నారు. కానీ, కాంగ్రెస్‌ మాత్రం ఇప్పటికీ పటిష్ట ప్రణాళికను ఏర్పాటు చేసుకోలేదని తెలుస్తున్నది.

2024 ఎన్నికల కోసం విపక్షాల ఐక్యంగా పోరాడాలనే ఆలోచనలు చాలా ప్రతిపక్ష పార్టీల్లో ఉన్నది. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీని మట్టికరిపించిన తర్వాత టీఎంసీ ఇందుకోసం ప్రయత్నాలు ప్రారంభించింది. వీలైనంత త్వరగా దీనిపై ఓ నిర్ణయానికి వస్తేనే ఎన్నికలపై దీటుగా పోరాడటం సాధ్యమవుతుందని తెలిపింది. కానీ, కాంగ్రెస్ నుంచి స్పష్టమైన సంకేతాలు వెలువడలేదు.

Also Read: టార్గెట్ 2024: పీఎం మోడీ, యూపీ సీఎం యోగి ఇలాకాలో ప్రియాంక గాంధీ హల్‌చల్.. అందుకోసమేనా?

వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం కాంగ్రెస్ పై ఆధారపడలేమని టీఎంసీ నేతలు పలుమార్లు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతలూ ప్రతివ్యాఖ్యలు చేశారు. అయితే, వీటిని పక్కన బెట్టి జట్టు కట్టడానికి టీఎంసీ స్నేహహస్తం చాచింది. కానీ, ఆ రెండు పార్టీలు జట్టుకట్టడం ఆలస్యమైంది. తాజాగా, గోవా అసెంబ్లీ ఎన్నికల్లోనూ టీఎంసీ పూర్తిస్థాయిలో బరిలోకి దిగడానికి యోచిస్తున్నది. ఇది కాంగ్రెస్‌ను కలవరపెడుతున్నది. టీఎంసీ పరోక్షంగా బీజేపీకి సహకరించే అవుతుందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఈ ఆరోపణలను టీఎంసీ నేతలు తిప్పికొడుతున్నారు. ఆ మైండ్ సెట్ మారాలని, ప్రతిపక్షంలో కాంగ్రెస్ లాగే, తాము ఒక పార్టీ అని, ఒకరినొకరం తక్కువ చేసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. ఇక్కడా ఇద్దరి లక్ష్యం బీజేపీ ఓటమే కదా అని పేర్కొన్నారు.

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ లేకుండా ప్రతిపక్షాలు ఐక్యమై పోరాడటం అసాధ్యమని మమతా బెనర్జీకి తెలుసు అని, ఎందుకంటే కనీసం 200 నుంచి 230 వరకు బీజేపీపై నేరుగా పోటీ చేసే స్థానంలో ఇంకా కాంగ్రెస్ మాత్రమే ఉన్నదని ఓ కాంగ్రెస్ నేత అన్నారు. కాంగ్రెస్‌తో కలిసి పోరాడటానికి తాము వెయిట్ చేశామని, కానీ, ఆ పార్టీ నుంచి రెస్పాన్స్ రాలేదని టీఎంసీ నేతలు వాదిస్తున్నారు. ఆ తర్వాతే ఇతర రాష్ట్రాల్లోనూ టీఎంసీని విస్తరించాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిపారు.

బిహార్‌లో ఉపఎన్నికలు జరిగిన రెండు స్థానాలనూ అధికార పార్టీ జేడీయూనే గెలుచుకుందని, ఒకవేళ కాంగ్రెస్, ఆర్జేడీ కలిసి పోటీ చేస్తే ఫలితాలు వేరేగా ఉండేవని ఓ ప్రతిపక్ష నేత అన్నారు.

Also Read: మళ్లీ ప్రధానిగా నరేంద్ర మోడీనే.. యూపీ సీఎం అభ్యర్థి ఆయనే.. : కేంద్ర హోం మంత్రి

ఇటీవలి ఉపఎన్నికల ఫలితాలూ కాంగ్రెస్‌లో మరో ఆందోళనను కలిగిస్తున్నది. చాలా రాష్ట్రాల్లో స్థానిక పార్టీలు సత్తా చాటాయి. హిమాచల్ ప్రదేశ్ మినహా చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ భంగపడింది. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రంలో దారుణంగా ఓటమిని చవిచూసింది. అసోంలో ఐదు స్థానాల్లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరినవారూ ఆ రెండు స్థానాల నుంచి గెలుపొందారు. మూడు సీట్లు బీజేపీ గెలుచుకోగా, మిగిలిన రెండు స్థానాలను బీజేపీ మిత్రపక్షం యూపీపీఎల్ గెలుచుకుంది. ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌, తెలంగాణ, బిహార్ సహా పలు రాష్ట్రాల్లో స్థానిక పార్టీల హవానే సాగింది. దీంతో వచ్చే సార్వత్రిక ఎన్నికలు కాంగ్రెస్‌కు కత్తిమీద సాము అనే స్పష్టమవుతున్నది. ఎందుకంటే కాంగ్రెస్ ఫుట్ ప్రింట్ క్రమంగా తగ్గుముఖం పట్టడం, ఆయా ప్రాంతాల్లో స్థానిక పార్టీల ప్రాబల్యం పెరగడం ఆ పార్టీకి కొత్త సవాళ్లను తెచ్చిపెడుతున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios