Asianet News TeluguAsianet News Telugu

Bypoll Results 2021 Live Updates: 3 లోక్‌సభ, 29 అసెంబ్లీ స్థానాలకు కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు

దేశంలోని మూడు లోక్‌సభ, 29 అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. గత నెల 30వ తేదీన ఎన్నికలు జరిగాయి. 
 

Bypoll Results 2021 Live Updates:Counting Of Votes On For Bypolls To 3 Lok Sabha, 29 Assembly Seats
Author
New Delhi, First Published Nov 2, 2021, 10:13 AM IST

అసోంలోని ఒక స్థానంలో బీజేపీ, నాలుగు చోట్ల ఎన్డీయే కూటమి ఆధిక్యంలో నిలిచింది.

బీహార్ లోని కుశేశ్వర్ అస్థాన్ అసెంబ్లీ స్థానాన్ని జేడీ(యూ) దక్కించుకొంది. ఆర్జేడీ రెండో స్థానంలో, ఎల్జేపీ మూడో స్థానంలో నిలిచింది.

బెంగాల్ లోని నాలుగు అసెంబ్లీ స్థానాల్లో టీఎంసీ అభ్యర్ధులు భారీ విజయాన్ని నమోదు చేశారు.

దాద్రానగర్ హావేలీ ఎంపీ స్థానంలో శివసేన అభ్యర్ధి కళ దేల్కర్ 51,300 ఓట్ల ఆధిక్యంతో బీజేపీ అభ్యర్ధి మహేష్ గమిత్ పై విజయం సాధించారు.

కర్ణాటకలోని రెండు స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ చేరో స్థానంలో విజయం సాధించాయి.

కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి శ్రీనివాస్ మానే కర్ణాటకలోని హంగల్ అసెంబ్లీ స్థానంలో విజయం సాధించారు.

మిజోరాంలోని ఏకైక అసెంబ్లీ స్థానాన్ని మిజో నేషనల్ ఫ్రంట్ గెలుచుకొంది.

రాజస్థాన్ లోని ధరియావాద్ అసెంబ్లీ స్థానంలో విజయం సాధించింది. వల్లభనగర్ లో ఆధిక్యంలో ఆ పార్టీ నిలిచింది.

హిమాచల్‌ప్రదేశ్ లోని మూడు అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకొంది.
నాగాలాండ్ లోని షామటోర్ చెస్సోర్ లో నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ విజయం సాధించింది.

హిమాచల్ ప్రదేశ్ లోని  2 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్, ఒక్క స్థానంలో బీజేపీ అభ్యర్ధి ఆధిక్యంలో నిలిచారు. మధ్యప్రదేశ్ లోని రెండు స్థానాల్లో బీజేపీ, ఒక్క స్థానంలో కాంగ్రెస్ ఆధిక్యంలో నిలిచింది.

మద్యప్రదేశ్ రాష్ట్రంలోని పృథ్వీపూర్ ఉప ఎన్నికలో 10 రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యేసరికి బీజేపీ అభ్యర్ధి 2,993 ఓట్ల ఆధిక్యంలో నిలిచారు.

సింధగీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్ధి బాలప్ప తన సమీప అభ్యర్ధి కాంగ్రెస్ అభ్యర్ధి ఆశోక్ పై ఆధిక్యంలో నిలిచారు.

హనగల్ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్ధి బీజేపీ అభ్యర్ధిపై ఆధిక్యంలో నిలిచారు.

బీహార్ లోని తారాపూర్ , కుశేష్వర్ అసెంబ్లీ స్థానాల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఈ రెండు అసెంబ్లీ స్థానాల్లో తమ పార్టీ అభ్యర్ధులు భారీ మెజారిటీతో విజయం సాధిస్తారని ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్ విశ్వాసం వ్యక్తం చేశారు.

భీహార్ లోని తారాపూర్ , కుశేష్వర్ అసెంబ్లీ స్థానాల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.

ఎల్లెనాబాద్ ఉపఎన్నికల్లో అభయ్ చౌతాలా 6,031 ఓట్ల ఆధిక్యలో ఉన్నారు.

 మేఘాలయాలోని నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ) మంగళవారం ఓట్ల లెక్కింపు జరుగుతున్న మవ్రింగ్‌నెంగ్ , రాజబాలా అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉంది. యూడీపీ అభ్యర్ధి మవ్‌పలాంగ్ నియోజకవర్గంలో ఆధిక్యంలో ఉన్నారు. 

తెలంగాణలోని హుజూరాబాద్ అసెంబ్లీ  స్థానంలో  బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్  ఆధిక్యంలో నిలిచారు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బద్వేల్ అసెంబ్లీ స్థానానికి వైసీపీ అభ్యర్ధి డాక్టర్ సుధ విజయం సాధించారు

కర్ణాటకలోని సిండగిలో బీజేపీ, హన‌గల్ లో కాంగ్రెస్ అభ్యర్ధి లీడ్ లో ఉన్నారు.

అసోంలోని ఐదు స్థానాల్లో మూడు చోట్ల  బీజేపీ, రెండు చోట్ల యూపీపీఎల్ అభ్యర్ధులు ఆధిక్యంలో నిలిచారు.

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని గోస్బా అసెంబ్లీ నియోజకవర్గంలో  టీఎంసీ అభ్యర్ధి 90 వేల ఓట్ల ఆధిక్యంలో నిలిచారు. ధిన్‌హతా అసెంబ్లీ స్థానంలో 81,460 ఓట్ల మెజారిటీ, ఖరాద్ స్థానంలో  టీఎంసీ అభ్యర్ధి 18 వేల ఓట్ల ఆధిక్యంలో నిలిచారు

దాద్రానగర్ హావేలీ స్థానంలో శివసేన అభ్యర్ధి ఆధిక్యంలో నిలిచారు.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నాలుగు స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో నిలిచింది. ఖాండ్వా ఎంపీ స్థానంతో పాటు మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో Bjp ఆధిక్యంలో నిలిచింది. ఖాండ్వా ఎంపీ స్థానంలో బీజేపీ అభ్యర్ధి జ్ఞానేశ్వర్ పాటిల్ తన ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి రాజనారాయణ్ సింగ్ పూర్ణిపై 14,365 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారని అధికారి తెలిపారు.

దేశంలోని  మూడు లోక్‌సభ, 29 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం నాడు ఉదయం ప్రారంభమైంది. దేశంలోని 13 రాష్ట్రాలు,  కేంద్ర పాలిత ప్రాంతమైన దాద్రానగర్ హవేలీలో జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.

గత నెల 30వ తేదీన అసోంలోని ఐదు అసెంబ్లీ స్థానాలు, West Bengal లో నాలుగు స్థానాలు,. మధ్యప్రదేశ్ లో మూడు స్థానాలు, హిమాచల్ ప్రదేశ్, మేఘాలయ, బీహార్ రాష్ట్రాల్లోని రెండు అసెంబ్లీ స్థానాలు, కర్ణాటక, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మిజోరాం, తెలంగాణలోని ఒక్కొక్క అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి.

దాద్రానగర్ హవేలీ, హిమాచల్‌ప్రదేశ్ లోని మండి, మధ్యప్రదేశ్ లోని ఖండ్వా ఎంపీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి.ఈ మూడు స్థానాల నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న ముగ్గురు అభ్యర్ధులు మరణించడంతో  ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి.

 

Follow Us:
Download App:
  • android
  • ios