Asianet News TeluguAsianet News Telugu

Gang rape : వ్యాపారి భార్యపై సామూహిక అత్యాచారం.. సిగరెట్లతో కాల్చి చిత్రహింసలు.. బంగారం, నగదు, స్కూటీ చోరీ..

Gang rape : ఓ వ్యాపారి భార్య ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఐదుగురు దుండగులు మద్యం మత్తులో ఆమెపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఆమెను చిత్రహింసలకు గురి చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది.

Businessmans wife gang-raped.. Burned and tortured with cigarettes.. Gold, cash, scooty stolen..ISR
Author
First Published Nov 17, 2023, 10:23 AM IST

Gang rape :  యూపీలో దారుణం జరిగింది. ఓ వ్యాపారి భార్యపై పలువురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమె శరీరంపై సిగరెట్లతో వాతలు పెట్టారు. అనంతరం ఇంట్లో ఉన్న బంగారం, నగదు, టీవీని చోరీ చేయడంతో పాటు బయట ఉన్న స్కూటీని కూడా ఎత్తుకెళ్లారు.

దారుణం.. మహిళా డాక్టర్ కు మద్యం తాగించి లైంగిక దాడి.. వీడియో తీసి బ్లాక్ మెయిల్..

వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బిజ్నోర్ జిల్లాకు చెందిన ఓ వ్యాపారి తన భార్య, పిల్లలు తల్లితో కలిసి జీవిస్తున్నారు. అయితే మంగళవారం రాత్రి ఐదుగురు దుండగులు మద్యం మత్తులో ఇంట్లోకి ప్రవేశించారు. ఆ సమయంలో వ్యాపారి భార్య మాత్రమే ఒంటరిగా ఇంట్లో ఉన్నారు.  నేరుగా ఆ వివాహిత దగ్గరకు వెళ్లి మత్తుమందు పూసిన రుమాలును ఆమె ముక్కు దగ్గర పెట్టారు. దీంతో ఆమె స్పృహ కోల్పోయింది. దీంతో ఆమెను కట్టే దుండగులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఆమె శరీరంపై సిగరెట్లతో కాల్చారు.

Maharashtra: భార్య వివాహేతర సంబంధం.. సోదరుడిని చంపిన భర్త.. అసలేం జరిగింది?

అనంతరం బీరువా తాళాలు పగులగొట్టి బంగారు ఆభరణాలు, వెండి, రూ.1.5 లక్షల నగదు, గదిలో అమర్చిన ఎల్ ఈడీ టీవీని చోరీ చేశారు. అనంతరం మహిళలో గదిలో బంధించి బయట ఉన్న స్కూటీని తీసుకొని పారిపోయారు. ఈ ఘటనకు పాల్పడిన దుండగులే అక్టోబర్ 19వ తేదీన తనను బంధించి రూ.80 వేల నగదును అపహరించారని వ్యాపారి పేర్కొన్నారు. 

israel - hamas war :గాజా పార్లమెంట్ బిల్డింగ్ ను నేలమట్టం చేసిన ఇజ్రాయెల్ దళాలు.. వీడియో విడుదల..

అయితే ఆ సమయంలో ఆ వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే దుండగులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అక్టోబర్ 19న జరిగిన ఘటనలో ఫిర్యాద చేసినా.. కేసు నమోదు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్టేషన్ ఇన్ చార్జి వికాస్ కుమార్ ను ఎస్పీ నీరజ్ జదౌన్ చర్యలు తీసుకున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios