israel - hamas war :గాజా పార్లమెంట్ బిల్డింగ్ ను నేలమట్టం చేసిన ఇజ్రాయెల్ దళాలు.. వీడియో విడుదల..

ఇజ్రాయెల్ - హమాస్ దళాలకు మధ్య యుద్దం కొనసాగుతోంది. దీంతో ఇరువైపులా తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతోంది. తాజాగా గాజాలో ఉన్న పార్లమెంట్ భవనాన్ని ఇజ్రాయెల్ సైన్యం పేల్చివేసింది.

Israeli forces blew up the Gaza parliament building.. video released..ISR

గాజాలోని పార్లమెంట్ భవనాన్ని ఇజ్రాయిల్ దళాలు నేలమట్టం చేశాయి. ఆ భవనాన్ని రెండు రోజుల కిందట ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) సైనికులు స్వాధీనం చేసుకున్నారు. అయితే తాజాగా దానిని బాంబులతో పేల్చివేశాయి. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో విడులైంది. అది ఇప్పుడు వైరల్ గా మారింది.

సోమవారం గోలానీ బ్రిగేడ్ సభ్యులు ఈ స్థలాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న తర్వాత భవనం విధ్వంసం జరిగిందని ఇజ్రాయెల్ కు చెందిన వైనెట్ తెలిపింది. అక్టోబర్ 7 దాడులకు ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ హమాస్ తో పోరాడుతున్న గాజా సిటీలోని భవనం లోపల బ్రిగేడ్ లోని సైనికులు ఇజ్రాయెల్ జెండాలను ఎగురవేస్తున్నట్లు సోమవారం ఆన్ లైన్ లో ఓ వీడియో షేర్ అయ్యింది. కాగా..ఇజ్రాయెల్ కు చెందిన ఐ24ఎన్ ఇంగ్లీష్ ఎక్స్ ఖాతాలో పార్లమెంటు భవనం ధ్వంసమైన వీడియోను షేర్ చేసింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios