ఓ బిజినెస్ మ్యాన్ దారుణానికి ఒడిగట్టాడు. స్వయంగా మేనకోడలి మీద యేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. దాంతో ఊరుకోకుండా ఆ విషయం ఎవరికైనా చెబితే గ్యాంగ్ స్టర్లతో చంపిస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు.
ముంబై : తన మేనకోడలిపై పలుమార్లు molesatation చేసిన ఓ Business Men.. ఆ విషయం బయటికి చెబితే Gangstersతో చంపిస్తాను అంటూ ఆమెను బెదిరించాడు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని Mumbaiలో వెలుగులోకి వచ్చింది. 2007 నుంచి తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని, అండర్ వరల్డ్ డాన్ Dawood Ibrahim,ఇతర క్రిమినల్స్ తో ఉన్న సంబంధాలతో తనను బెదిరిస్తున్నాడని 35 ఏళ్ల మహిళ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ‘నిందితుడు తొలిసారి 2007 లో ఒక హోటల్ లో తనను రేప్ చేశాడని బాధితురాలు చెప్పింది. ఆ తర్వాత ముంబై సబర్బన్ లోని పలు చోట్ల ఆమెపై అనేకసార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎక్కడ చెప్పొద్దని బెదిరిస్తూ ఉండేవాడు. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం తనకు స్నేహితుడని మరో కరుడు గట్టిన నేరస్థుడి కూడా బంధువు.. అని చెబుతూ వారితో చంపిస్తానంటూ బెదిరించినట్లు’’ ఆమె ఫిర్యాదులో పేర్కొంది.
అంతేకాకుండా నిందితుల తరపు నుంచి ఒక శాతం వడ్డీపై రెండు కోట్లు రుణంగా తీసుకున్నాడని.. కానీ ఇప్పటికీ తిరిగి చెల్లించడం లేదని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె అందేరి ప్రాంతంలో నివాసం ఉండడంతో అంబోలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వ్యాపారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని చెప్పారు. ఈ కేసును తదుపరి దర్యాప్తు కోసం ఎంఐడీసీ పోలీస్ స్టేషన్ కి అప్పగించినట్లు వెల్లడించారు.
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని.. భర్తకు విషం పెట్టి చంపిన భార్య..
ఇదిలా ఉండగా, మధ్యప్రదేశ్ లో ఇలాంటి దారుణమే చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బేతుల్‌లో టాక్సీలో 62 ఏళ్ల మహిళపై ఓ క్యాబ్ డ్రైవర్ అఘాయిత్యాకి పాల్పడ్డాడు. ఈ ఘటన జరిగిన మూడు రోజుల తరువాత పోలీసులు ఆ క్యాబ్ డ్రైవర్ ను అరెస్టు చేశారు. మంగళవారం సాయంత్రం భోపాల్‌లో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 12వ తేదీన ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళుతున్న వృద్ధురాలు నడవడానికి ఇబ్బంది పడుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
టాక్సీ డ్రైవర్ మహిళ దగ్గర ఆగాడు. ఆమె తనను వేదిక వద్ద డ్రాప్ చేయమని కోరింది. అయితే, మహిళ టాక్సీ ఎక్కిన తర్వాత, క్యాబ్ డ్రైవర్ ఆమెను వేరే గమ్యస్థానానికి తీసుకెళ్లాడు. దారిలో ట్యాక్సీలో మహిళపై అత్యాచారం చేసి, ఆ తర్వాత జాతీయ రహదారి 69లోని సుఖ్త్వా వద్ద ఆమెను వదిలి పారిపోయాడు. బేతుల్ కొత్వాలి పోలీసులకు సమాచారం అందడంతో మొదట.. గుర్తు తెలియని నిందితుడిపై అత్యాచారం, కిడ్నాప్ కేసు నమోదు చేసి అతని కోసం వెతకడం ప్రారంభించారు.
సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) సిమల ప్రసాద్ ఆధ్వర్యంలో బేతుల్‌లో ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. జాతీయ రహదారి 69లోని టోల్ ప్లాజా వద్ద అమర్చిన సీసీటీవీ కెమెరా ఫుటేజీ, మహిళ ఇచ్చిన వివరణ ఆధారంగా నిందితుడి గురించి బృందానికి ఆధారాలు లభించాయి. నిందితుడు మనోజ్ మాలవీయ విదిషా జిల్లాకు చెందిన వ్యక్తి, ప్రస్తుతం భోపాల్‌లోని అయోధ్య నగర్‌లో నివసిస్తున్నాడు.
మాలవీయ వృత్తిరీత్యా టాక్సీ డ్రైవర్. ఆదివారం భోపాల్ నుంచి నాగ్‌పూర్‌కు ఇద్దరు వైద్యులను దింపేందుకు మనోజ్ టాక్సీలో వెళ్లాడు. బుధవారం నిందితుడికి వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరిచారు.
