ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న బస్సు బోల్తా పడింది. ఈ ఘటన లో 30 మందికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు రక్షించి హాస్పిటల్ కు తరలించారు.
ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రా-లక్నో ఎక్స్ ప్రెస్ వేపై గురువారం ఉదయం బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 30 మందికి గాయాలు అయ్యాయి. వారంతా ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ బస్సు కూలీలను తీసుకొని శ్రావస్తి నుంచి గుజరాత్ వెళ్తోంది. అయితే ఎటావా జిల్లాలోని చౌబియా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎక్స్ ప్రెస్ వే పైకి చేరుకున్న సమయంలో బస్సు ఒక్క సారిగా అదుపుతప్పి బోల్తా పడింది.
దారుణం.. మూడో తరగతి బాలికపై రిటైర్డ్ టీచర్ల సామూహిక అత్యాచారం.. 20 ఏళ్ల శిక్ష విధించిన కోర్టు
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 80 మంది కూలీలు ఉన్నారు. వీరిలో 30 మంది కూలీలకు గాయాలయ్యాయి. వీరిని సైఫాయి మెడికల్ కాలేజీలో చేర్పించారు. ఎవరికీ తీవ్ర గాయాలు కాలేదు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని సర్కిల్ ఆఫీసర్ సైఫాయి నాగేంద్ర కుమార్ చౌబే తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఇలాంటి ప్రమాదమే ఈ నెల 6వ తేదీన ఏపీలో చోటు చేసుకుంది. శ్రీకాకుళం నుండి పాతపట్నంకు బయలుదేరిన బస్సు ప్రమాదానికి గురైంది. 6వ తేదీన ఉదయం శ్రీకాకుళం నుంచి బయలుదేరిన మార్గమధ్యలో ప్రయాణికులను ఎక్కించుకుంటూ ముందుకు వెళ్తోంది. ఈ క్రమంలో బస్సు నరసన్నపేట సమీపానికి వెళ్లగానే అదుపుతప్పింది. జాతీయ రహదారిపై వేగంగా వెళుతుండగా బస్సు స్టీరింగ్ ఒక్కసారిగా విరిగిపోయింది.
యాక్సిడెంట్ లో కుమారుడు మృతి.. ఆత్మను ఇంటికి తీసుకొచ్చేందుకు విచిత్ర పూజలు..
దీంతో డ్రైవర్ ఎంత ప్రయత్నించినా ఆగకుండా అదుపుతప్పిన బస్సు రోడ్డుపక్కకు దూసుకెళ్లి బోల్తా పడింది. కోమర్తి జంక్షన్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆర్టిసి సిబ్బంది సహా 19 మంది ప్రయాణికులు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి బస్సులో చిక్కుకున్న వారిని బయటకు తీశారు. గాయాలపాలైన క్షతగాత్రులను హాస్పిటల్ కు తరలించారు. బస్ యాక్సిడెంట్ పై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ప్రమాదం కారణంగా హైవేపై వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ సమస్య తలెత్తింది.
