ఇద్దరు రిటైర్డ్ టీచర్లు తొమ్మిదేళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. మూడో తరగతి చదువుతున్న బాలికను ప్రిన్సిపాల్ గదిలోకి తీసుకెళ్లి ఈ దారుణానికి పాల్పడ్డారు. దీంతో కోర్టు వారికి శిక్ష విధించింది.
పిల్లలకు చదువు చెప్పి విద్యాబుద్దులు నేర్పాల్సిన టీచర్లే తప్పుడు పని చేశారు. అభం శుభం తెలియని తొమ్మిదేళ్ల చిన్నారిపై సామూహిక లైంగికదాడికి ఒడిగట్టారు. ఇందులో నిందితుల ఇద్దరి వయస్సు 65 ఏళ్లకు పైగా ఉండటం ఇక్కడ గమనార్హం. వీరిద్దరూ మూడో తరగతి చదువుతున్న బాలికపై అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ ఘటన గతేడాది మార్చిలో జరగ్గా.. తాజాగా కోర్టు వారికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.
ప్రధాని అమెరికా పర్యటన.. హెచ్-1బీ వీసాలపై యూఎస్ కొత్త నిర్ణయం.. భారతీయులకు ఏ విధంగా ఉపయోగం అంటే ?
అడిషనల్ డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ అడ్వొకేట్ (ఏడీజీసీ) దినేష్ కుమార్ శర్మ తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ముజఫర్ నగర్ జిల్లాలో రాజ్ కుమార్ శర్మ(72) అనే రిటైర్డ్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు బాలికల కోసం ఓ పాఠశాలను నడుపుతున్నాడు. ఆ స్కూల్ కు ఆయన ప్రిన్సిపాల్ గా కూడా వ్యవహరించేవాడు. అందులోనే మరో రిటైర్డ్ గవర్నమెంట్ టీచర్ ఉదయ్ పాల్ ధీమన్ (65) కూడా బోధించేవాడు.
ఈ స్కూల్ లో స్థానికంగా ఉండే ఓ తొమ్మిదేళ్ల బాలిక మూడో తరగతి చదువుతోంది. గతేడాది మార్చి నెలలో ఆ బాలిక ఎప్పటిలాగే స్కూల్ కు వెళ్లింది. అయితే ఆ స్కూల్ ప్రిన్సిపాల్ బాలికను తన గదిలోకి తీసుకెళ్లాడు. అనంతరం ఆమె బట్టలు విప్పేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆ చిన్నారికి రక్తస్రావమైంది. తరువాత ఆ బాలిక ఇంటికి చేరుకుంది.
మరొకరితో అక్రమ సంబంధం ఉందంటూ వివాహితపై ప్రియుడి అనుమానం.. బైక్ పై తీసుకెళ్లి, పొలంలో..
మరుసటి రోజు వరకు బాధితురాలికి రక్తస్రావం జరుగుతూనే ఉంది. దీంతో బాలిక తల్లి దానిని గమనించింది. ఏం జరిగిందని ఆరా తీయడంతో తనపై జరిగిన దారుణాన్ని తల్లికి వివరించింది. అయితే తెల్లారి ఆ బాలిక స్కూల్ కు రాలేదని ఓ టీచర్ తండ్రికి ఫోన్ చేశారు. బాలికపై జరిగిన అఘాయిత్యంపై తండ్రి ఆ టీచర్ ను ప్రశ్నించారు. దీంతో ఆ టీచర్.. ప్రిన్సిపాల్ తరుఫున క్షమాపణలు చెప్పడం మొదలుపెట్టాడు. ఆ టీచర్ తీరుపై తండ్రికి అనుమానం కలిగింది.
యాక్సిడెంట్ లో కుమారుడు మృతి.. ఆత్మను ఇంటికి తీసుకొచ్చేందుకు విచిత్ర పూజలు..
అనంతరం తండ్రి పోలీసులను ఆశ్రయించారు. తన కూతురుపై జరిగిన అఘాయిత్యానికి వారికి వివరించారు. నిందితులను శిక్షించాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు ప్రిన్సిపాల్, ఆ టీచర్ పై ఐపీసీ 376డీ (గ్యాంగ్ రేప్), పోక్సో చట్టం సహా పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీనిపై అప్పటి నుంచి కోర్టులో విచారణ జరిగింది. తాజాగా ముజఫర్ నగర్ పోక్సో కోర్టు ఈ కేసులో తీర్పు వెలువరించింది. రిటైర్డ్ టీచర్లకు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.
