ప్రయాణికురాలిపై బస్ కండక్టర్ అత్యాచారయత్నం

Bus conductor attempts to rape girl in bus
Highlights

పోలీసుల  అదుపులో నిందితుడు...

బస్టాండ్ ఆగి వున్న బస్ లోకి ఒంటరిగా ఎక్కిన ఓ మహిళపై కండక్టర్ అసభ్యంగా ప్రవర్తించాడు. బస్టాండ్ లో చాలా మంది ప్రయాణికులు ఉండగానే ఆమెపై అఘాయిత్యానికి ప్రయత్నించాడు. దీంతో యువతి గట్టిగా  అరవడంతో బస్టాండ్ లోని వారు బస్ లోకి వచ్చే లోపే నిందితుడు మాయమయ్యాడు. ఈ ఘటన ఒడిషా రాజధాని భువనేశ్వర్ లో చోటుచేసుకుంది.   

కేంజర్ డింబో గ్రామానికి చెందిన యువతి సొంతూరుకు వెళ్లేందుకు భువనేశ్వర్ లోని బర్ముండా బస్టాండ్ లో రాత్రి 9 గంటల సమయంలో వచ్చింది. అక్కడ తన గ్రామానికి  వెళ్లే ప్రైవేటు బస్సు సిద్ధంగా ఉండడంతో అందులో ఎక్కి కూర్చుంది. బస్సు ఇతర ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో కాళీగా ఉంది. అందులో ఈ యువతి ఒక్కతే ఉండడాన్ని గమనించిన కండక్టర్ ఆమెపై కన్నేశాడు. యువతి వద్దకు వెళ్లి ఆమె పక్కన కూర్చొని అసభ్యంగా తాకడం, మాట్లాడటం ప్రారంభించాడు. దీంతో భయపడిపోయిన యువతి గట్టిగా అరిచింది. ఈమె అరుపులు విన్న బస్టాండ్ లోని వారు బస్సులోకి వచ్చేలోపే కండక్టర్ పరారయ్యాడు.

కాసేపటికి మళ్లీ బస్ లోకి వచ్చిన నిందితుడు బాధితురాలిని మార్గ మద్యలోనే దించేశాడు. ఎలాగోలా ఇంటికి చేరుకున్న యువతి కుటుంబ సభ్యులకు జరిగిన విషయాన్ని తెలియజేసింది.దీంతో వారు పోలీసలకు ఫిర్యాదు  చేయడంతో కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

 

loader