Asianet News TeluguAsianet News Telugu

IAS (Cadre) rules: ఐఏఎస్ క్యాడ‌ర్ రూల్స్ ర‌గ‌డ‌.. కేంద్రంపై విరుచుకుప‌డుతున్న సీఎంలు !

IAS (Cadre) rules: ఇటీవ‌లి కాలంలో కేంద్రంలోని ప్ర‌ధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో బీజేపీ స‌ర్కారు తీసుకుంటున్న ప‌లు నిర్ణ‌యాలు వివాదాస్ప‌దం అవుతున్నాయి, ప్ర‌స్తుతం ఐఏఎస్‌ క్యాడర్‌ నిబంధనలు మార్చాలన్న ప్రతిపాదనపై రాష్ట్ర ప్ర‌భుత్వాలు అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నాయి. ఈ చ‌ర్య‌లు స‌మాఖ్య స్పూర్తికి విరుద్ధ‌మ‌ని పేర్కొంటున్నాయి. 
 

Bury proposed amendments to IAS (Cadre) rules: Jharkhand CM to PM Modi
Author
Hyderabad, First Published Jan 23, 2022, 4:54 AM IST

IAS (Cadre) rules: ఇటీవ‌లి కాలంలో కేంద్రంలో ప్ర‌ధాని మోడీ నేతృత్వంలో బీజేపీ స‌ర్కారు తీసుకుంటున్న ప‌లు నిర్ణ‌యాలు వివాదాస్ప‌ద మ‌వుతున్నాయి, ప్ర‌స్తుతం ఐఏఎస్‌ క్యాడర్‌ నిబంధనలు మార్చాలన్న ప్రతిపాదనపై రాష్ట్ర ప్ర‌భుత్వాలు అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నాయి. ఈ చ‌ర్య‌లు స‌మాఖ్య స్పూర్తికి విరుద్ధ‌మ‌ని పేర్కొంటున్నాయి. ఈ క్ర‌మంలోనే ప‌లు రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప్ర‌ధాని మోడీకి ఇదే విష‌యంపై లేఖ‌లు సైతం రాశాయి. ఐఏఎస్ క్యాడ‌ర్ నిబంధ‌న‌లు మార్చాల‌న్న ప్ర‌తిపాద‌న‌లు విరమించుకోవాలని కోరుతూ రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌, ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్‌ బఘేల్‌, జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. కేంద్రం తీసుకుంటున్న నిర్ణ‌యంపై ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. 

ఐఏఎస్ అధికారుల డిప్యూటేష‌న్‌పై కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌తిపాదిత స‌వ‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా గ‌ళం వినిపిస్తూ.. రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌, ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్‌ బఘేల్‌, జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. రాష్ట్ర ప్ర‌భుత్వ నిర్ణ‌యంతో సంబంధం లేకుండా ఐఏఎస్‌ల డిప్యూటేష‌న్ నియ‌మించుకునే అధికారం కేంద్ర ప్ర‌భుత్వానికి ద‌ఖ‌లు ప‌ర్చాల‌నే ప్ర‌తిపాద‌నల‌ను ప‌శ్చిమ‌బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ సైతం వ్య‌తిరేకిస్తున్నారు. ప్ర‌ధాని మోడీకి రాసిన లేఖ‌లో జార్ఖండ్ సీఎం హెమంత్ సోరెన్‌.. ఈ నిర్ణ‌యంపై అభ్యంత‌రం వ్య‌క్తంచేశారు. ఇది స‌మాఖ్య వ్య‌వ‌స్థ‌కు విరుద్ధ‌మ‌ని అన్నారు. ఈ ప్ర‌తిపాద‌న‌లు భార‌త్ ఐక్య‌త‌ను బ‌ల‌హీన ప‌రుస్తుంద‌ని పేర్కొన్నారు. 

కేంద్రం తలపెట్టిన ఐఏఎస్ అధికారుల డిప్యూటేష‌న్‌పై కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌తిపాదిత స‌వ‌ర‌ణ‌లు  అస్థిరతా భావనను, గందరగోళాన్ని కలిగిస్తాయని  ఛత్తీస్‌గఢ్ ముఖ్య‌మంత్రి భూపేష్ బ‌ఘేల్ త‌న లేఖ‌లో పేర్కొన్నారు. రాజకీయ జోక్యం వల్ల అధికారులు, ముఖ్యంగా ఎన్నికల సమయాల్లో, నిష్పాక్షికంగా పనిచేయలేరని తెలిపారు. ఛ‌త్తీస్ గ‌ఢ్ పూర్తిగా ఈ సవరణలను వ్యతిరేకిస్తున్నదని స్పష్టం చేశారు. రాజస్థాన్ ముఖ్య‌మంత్రి అశోక్ గెహ్లాట్ స్పందిస్తూ.. రాష్ట్రాల ఏకాభిప్రాయం లేకుండా ఏకపక్షంగా అధికారులను పంపించే అధికారం సవరణల ద్వారా కేంద్రానికి దక్కుతుందని  అన్నారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని స్ప‌ష్టం చేశారు. ఈ చ‌ర్య‌లు ఐఏఎస్‌ వ్యవస్థను బలహీనపరుస్తాయ‌ని పేర్కొన్నారు. 

 

ఐఏఎస్ అధికారుల డిప్యూటేష‌న్‌పై కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌తిపాదిత స‌వ‌ర‌ణ‌లపై జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ మాట్లాడుతూ ఇప్పటికే ఒత్తిడిలో ఉన్న కేంద్ర-రాష్ట్ర సంబంధాలను ఈ చర్య మరింత దెబ్బతీసే అవకాశం ఉందని అన్నారు. ప్రజా సంక్షేమం, సమాఖ్య స్ఫూర్తిని దృష్టిలో ఉంచుకొని రాజ్యాంగ నిర్మాతలు అఖిల భారత సర్వీసులకు ప్రాణం పోశారని గుర్తుచేశారు.  ఇది స‌మాఖ్య వ్య‌వ‌స్థ‌కు వ్య‌తిరేకం అని పేర్కొన్నారు. ఐఏఎస్‌ వ్యవస్థ ఈ సవరణలతో నీరుగారి పోతుందని హెచ్చరించారు.  వాటిని ఉపసంహరించుకోవాలనిహేమంత్‌ సోరెన్‌ డిమాండ్‌ చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios