Asianet News TeluguAsianet News Telugu

జోస్ అలుకాస్ దుకాణం గోడకు కన్నం.. 30 కిలోల నగలు చోరీ...!!

దుకాణం పక్కనే ప్రహరీ గోడ ఉండగా, దాని సమీపంలో Car parking ఉంది. ప్రహరీ గోడ సమీపంలో ఉన్న స్థలంలో భూమిలో కన్నం చేసి దాని వైపుగా ఆగంతకులు లోపలికి ప్రవేశించారు. మేడ పైకి వెళ్లే ఏసీ పైపు పట్టుకుని పై అంతస్తుకు వెళ్లారు. అక్కడ ఏసీ కోసం వేసిన లెథరింగ్ కోర్స్ పగులగొట్టి 3వ అంతస్తులోని వజ్రాల విభాగానికి వెళ్లారు. 

Burglars strike at jos alukkas, escape with gold and diamond jewels in chennai
Author
Hyderabad, First Published Dec 16, 2021, 2:14 PM IST

చెన్నై :  నగరంలోని jos alukkas నగల దుకాణంలో దొంగలుపడ్డారు. ఏకంగా 30 కిలోల నగలు theft అయినట్లు నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం ఉదయం 9:30 గంటలకు స్థానిక తోటపాళ్యంలోని ఈ నగల దుకాణానికి చేరుకున్న సిబ్బంది.. వెనుకవైపున్న Hole in the wall పడి ఉండటాన్ని గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా, వేలూరు డివిజన్ డిఐజి బాబు, ఎస్పీ రాజేష్ కన్నా అక్కడకు చేరుకుని పరిశీలించారు. మంగళవారం రాత్రి పొద్దుపోయాక ఈ చోరీ జరిగి ఉంటుందని ఒక అంచనాకు వచ్చారు.

దొంగల జాడ కనుగొనేందుకు పోలీసు జాగిలాలను, వేలిముద్రల నిపుణులను రప్పించి సంఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు. దుకాణం పక్కనే ప్రహరీ గోడ ఉండగా, దాని సమీపంలో Car parking ఉంది. ప్రహరీ గోడ సమీపంలో ఉన్న స్థలంలో భూమిలో కన్నం చేసి దాని వైపుగా ఆగంతకులు లోపలికి ప్రవేశించారు. మేడ పైకి వెళ్లే ఏసీ పైపు పట్టుకుని పై అంతస్తుకు వెళ్లారు. అక్కడ ఏసీ కోసం వేసిన లెథరింగ్ కోర్స్ పగులగొట్టి 3వ అంతస్తులోని వజ్రాల విభాగానికి వెళ్లారు. 

భార్యపై అనుమానం.. హోటల్ రూమ్‌కి తీసుకెళ్లి చంపి.. తల, చేయి నరికి.. నగ్నంగా మార్చి భర్త పరార్...

అక్కడ CCTV cameraలపై స్ప్రే పిచికారీ చేయడంతో అవి పనిచేయలేదు. అనంతరం 3వ అంతస్తులో వజ్రాలు, నగలు, 2వ అంతస్తులో బంగారు నగలు, మొదటి అంతస్తులో వెండి నగలు దోచుకుని వచ్చిన దారినే వెళ్లిపోయారు. బుధవారం వేకువజామున 1నుంచి 3 గంటల్లోనూ ఈ చోరీ జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. 

ఈ చోరీలో పదిమంది పాల్గొని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దుకాణంలో పనిచేసే ఉద్యోగులు లేదా మాజీ ఉద్యోగలు ప్రమేయం ఉండి ఉండవచ్చని వారు భావిస్తున్నారు. అలాగే, దుకాణ సెక్యూరిటీ సిబ్బందిని కూడా విచారిస్తున్నారు. దుకాణంలో 63 కెమెరాలున్నాయి. కేసు దర్యాప్తు కోసం నాలుగు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios