Asianet News TeluguAsianet News Telugu

బ్యూరోక్రాట్లు మంత్రులు చెప్పిన‌ట్టే వినాలి. ‘ఎస్ సర్’ మాత్రమే అనాలి - కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

ప్రభుత్వం అధికారులు చెప్పినట్టు నడవదని, మంత్రులు చెప్పినట్టు నడుస్తుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. పేద ప్రజల కోసం చట్టాలన్ని ఉల్లంఘించాల్సి వస్తే కూడా వెనకాడబోమని తెలిపారు. మహాత్మా గాంధీ కూడా ఇదే చెప్పారని  అన్నారు

Bureaucrats should listen to what ministers say. Only 'Yes Sir' should be said - Union Minister Nitin Gadkari
Author
Nagpur, First Published Aug 10, 2022, 8:47 AM IST

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ బ్యూరోక్రసీపై విరుచుకుపడ్డారు. ‘ప్రభుత్వం మీరు (బ్యూరోక్రాట్లు)  చెప్పినట్టు పని చేయదు. మంత్రులు చెప్పినట్టు పని చేస్తుంది’’ అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 1995లో మనోహర్ జోషి మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఓ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించిన విధానాన్ని గుర్తు చేస్తూ ఆయ‌న ఈ విధంగా వ్యాఖ్యానించారు. ‘‘ మీరు చెప్పే దాని ప్రకారం ప్రభుత్వం పనిచేయదని నేను అధికారులకు (బ్యూరోక్రాట్‌లకు) ఎప్పుడూ చెబుతుంటాను. మీరు మేము చెప్పినదానికి ‘యస్ సార్’ అని మాత్రమే చెప్పాలి. మేము (మంత్రులు) ఏది చెబితే అది మీరు అమలు చేయాలి. ప్రభుత్వం మేము చెప్పినట్టు పని చేస్తుంది. ’’ అని నితిన్ గడ్కరీ అన్నారు.

రోడ్డుమీది గుంతలోనే స్నానం, యోగా... రోడ్ల దుస్థితిపై వినూత్న నిరసన..

1995లో గాదరిచోలి, మేల్‌ఘాట్‌లలో పోషకాహార లోపంతో వేలాది మంది గిరిజన పిల్లలు చనిపోయారని అన్నారు. ఆ స‌మ‌యంలో గ్రామాలకు రోడ్లు లేవని, రోడ్ల అభివృద్ధికి అటవీ చట్టాలు అడ్డు వచ్చాయ‌ని కేంద్ర మంత్రి అన్నారు. నాగ్‌పూర్‌లో గిరిజన శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర రోడ్డు, రవాణా, రహదారుల శాఖ మంత్రిగా ఉన్న నితిన్ గడ్కరీ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. అనంత‌రం ఆయ‌న మహాత్మా గాంధీని ఉద్ధ్యేశించి మాట్లాడుతూ.. పేద ప్రజల సంక్షేమం కోసం ఏ చట్టమూ అడ్డంకి కాదు అని అన్నారు. ‘ పేదల సంక్షేమానికి ఏ చట్టం అడ్డురాదని నాకు తెలుసు. వారి కోసం అలాంటి చట్టాన్ని 10 సార్లు కూడా ఉల్లంఘించాల్సి వస్తే మేము వెనుకాడబోము. మహాత్మా గాంధీ చెప్పిన మాట ఇదే ’’ అని నితిన్ గడ్కరీ చెప్పారు.

అంతకు ముందు మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేకు కేంద్ర మంత్రి అభినందించారు. ‘‘ మహారాష్ట్ర కేబినెట్‌లో ప్రమాణం చేసిన కొత్తగా ఎన్నికైన మంత్రులందరికీ అభినందనలు. మన అనుభవం మహారాష్ట్ర అభివృద్ధికి ఖచ్చితంగా ఉపయోగపడుతుందని మేము నమ్ముతున్నాము ’’ అని నితిన్ గడ్కరీ ఓ ట్వీట్ లో పేర్కొన్నారు. 

ఇదిలా ఉండ‌గా.. లాజిస్టిక్ పార్క్, ఫ్రూట్ అండ్ వెజిటబుల్ పార్క్ అభివృద్ధి కోసం హైవేకి ఆనుకుని ఉన్న 1100 ఎకరాల భూమిని  ఉత్తరాఖండ్ ప్రభుత్వం అభివృద్ధి చేస్తే.. డెహ్రాడూన్ చుట్టూ రింగ్ రోడ్డు నిర్మాణానికి అయ్యే ఖర్చు అంతా భరించేందుకు కేంద్రం సిద్ధంగా ఉంద‌ని నితిన్ గ‌డ్క‌రీ అన్నారు. ఈ మేర‌కు ఆయ‌న ఆ రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ ధామికి సోమ‌వారం హామీ ఇచ్చారు. కాగా.. డెహ్రాడూన్ చుట్టూ రింగ్ రోడ్డు ఏర్పాటు చేయ‌డం వ‌ల్ల ఆ సిటీలో చాలా వ‌ర‌కు ట్రాఫిక్ క‌ష్టాలు త‌గ్గ‌నున్నాయి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios