సినీ డైరెక్టర్ వివి వినాయక్ సినిమాలో మీరు ఒకటి గమనించే ఉంటారు.. దాదాపు ఆయన అన్ని సినిమాల్లో  సుమోలు గాలిలోకి ఎగురుతూ ఉంటాయి. అచ్చం అలాంటి సంఘటనే నిజంగా జరగింది. కాకపోతే ఎగిరింది సుమో కాదు ఎడ్ల బండి. మీరు చదివింది నిజమే... ఎండ్ల బండి పందేలు జరుగుతుండగా.. ఓ ఎడ్ల బండి గాలిలోకి ఎగిరింది. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది.

రాష్ట్రంలో ఎద్దుల పందాలు జోరుగా సాగుతున్నాయి. హసన్‌లో నిర్వహించిన పోటీల్లో ఎద్దులబండి వేగంగా వెళుతూ గాల్లోకి లేచింది. సుమారు మూడు అడుగులు ఎగిరి కిందపడిపోయింది. దీంతో బండి నడుపుతున్న వ్యక్తి కిండపడిపోయాడు. అయినాసరే ఆ జోడెద్దుల స్పీడ్ తగ్గలేదు. ముందుకుసాగేందుకు ప్రయత్నించాయి. నిర్వాహకులు వాటిని అదుపుచేయడంతో ప్రమాదం తప్పింది.