ఒక వర్గం ఇళ్లను కూలగొడుతున్నారని మరో వర్గం ప్రజలు ఆనందపడకూడదని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ అన్నారు. ఆ బుల్డోజర్లు అందరి ఇళ్లను కూల్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రాజ్యాంగం ప్రకారం దేశం నడుస్తుందని చెప్పారు. 

ఆస్తుల కూల్చివేతను సంబ‌రాలు జరుపుకోవద్దని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్ర‌జ‌లను కోరారు. ఆ బుల్డోజ‌ర్లు అంద‌రి ఇళ్ల‌కు రావొచ్చ‌ని అన్నారు. ‘‘ ఇతరుల ఇల్లు కూలితే సంబరాలు చేసుకోకండి. బుల్డోజర్ మీ ఇంటికి ఎప్పుడైనా రావచ్చు. కూల్చివేత సరైనదైతే, దానిని స్వాగతించండి. అన్యాయం జరిగితే చెప్పండి. ఈరోజు ఆయనకు జరిగితే రేపు మీకు కూడా జరుగుతుంది’’ అని సీఎం అన్నారు. 

దారుణం.. లిఫ్ట్ ఇస్తానని.. 62యేళ్ల వృద్ధురాలిపై టాక్సీ డ్రైవర్ అత్యాచారం.. అరెస్ట్..

ఈ మేర‌కు ఢిల్లీలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. చట్టం, రాజ్యాంగం ప్రకారం దేశం నడుస్తుందని అశోక్ గెహ్లాట్ అన్నారు. చట్టం, రాజ్యాంగం పాలన బలహీనంగా ఉంటే ప్రతీ ఒక్కరూ ఏదో ఒక సమయంలో బాధపడవలసి ఉంటుంద‌ని తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లో జూన్ 10న జరిగిన హింసాకాండకు పాల్పడిన నిందితుల ఆస్తుల కూల్చివేతపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. 

సిప్పీ సిద్ధు హత్య కేసులో కళ్యాణి అరెస్టు: ప్రేమ వ్యవహారమే కారణం

మ‌హ‌మ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై బీజేపీ మాజీ ప్ర‌తినిధి నూపుర్ శ‌ర్మ చేసిన అభ్యంతర‌క‌ర వ్యాఖ్య‌లు చేయ‌డంతో గ‌త శుక్ర‌వారం ప్రార్థ‌న‌ల త‌రువాత దేశ వ్యాప్తంగా ఆందోళ‌న‌లు జ‌రిగాయి. యూపీలోని ప‌లు న‌గ‌రాల్లో తీవ్ర ఉద్రిక్త‌త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఆందోళ‌న‌కారులు రాళ్లు రువ్వారు. ప్ర‌భుత్వ ఆస్తుల‌ను ధ్వంసం చేశారు. దీంతో అక్క‌డ ఉద్రిక్త‌త ప‌రిస్థితి ఏర్ప‌డింది. అయితే ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన హింసాకాండకు ప్రధాన సూత్రధారి అయిన జావేద్ మొహమ్మద్ అని అధికారులు నిర్ధారించుకొని అత‌డి ఇంటిని బుల్డోజ‌ర్ సాయంతో కూల‌గొట్టారు. అలాగే రాష్ట్రంలోని వివిధ చోట్ల జ‌రిగిన హింసాకాండ‌లో ప్ర‌మేయం ఉన్న మిగితా వారి ఆస్తుల‌ను కూడా యూపీ ప్ర‌భుత్వం కూల‌గొట్టింది. 

Hamidia hospital: 50 మంది నర్సులపై లైంగిక వేధింపులు! మానవ హక్కుల కమిషన్ సీరియ‌స్

అయితే ఉత్తరప్రదేశ్‌లోని అధికార బీజేపీ.. మైనారిటీ ముస్లిం వర్గాన్నిటార్గెట్ గా చేసుకుంటోంద‌ని ప్ర‌తిప‌క్ష నాయ‌కులు తీవ్రంగా ఆరోపించారు. కూల్చివేత ఘ‌ట‌న‌లు ఖండించాయి. అయితే, జావేద్ మహ్మద్ ఇంటిని కూల్చివేసిన ప్రయాగ్‌రాజ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పీడీఏ).. 1973 నాటి యూపీ స్టేట్ ప్లానింగ్ అండ్ డెవలప్‌మెంట్ రూల్స్ నిబంధనలకు విరుద్ధంగా ఇల్లు నిర్మాణం అయి ఉంద‌ని, అందుకే దానిని కూల్చివేశామ‌ని పేర్కొంది. ఇదిలావుండగా.. రాష్ట్రంలో ఇటీవలి హింసాత్మక ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి ఆస్తులను ఇకపై కూల్చివేయకుండా ఉండేలా ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ముస్లిం సంస్థ జమియత్ ఉలమా-ఇ-హింద్ దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు గురువారం విచారించనుంది.