టాక్సీలో వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడ్డ నేరానికి ఓ క్యాబ్ డ్రైవర్‌ను మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెను ఆమె గమ్యస్థానానికి చేరుస్తానని హామీ ఇచ్చి అతను ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తేలింది. 

మధ్యప్రదేశ్‌ : Madhya Pradeshలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని బేతుల్‌లో టాక్సీలో 62 ఏళ్ల మహిళపై ఓ క్యాబ్ డ్రైవర్‌ molesatationకి పాల్పడ్డాడు. ఈ ఘటన జరిగిన మూడు రోజుల తరువాత పోలీసులు ఆ Cab driver ను అరెస్టు చేశారు. మంగళవారం సాయంత్రం భోపాల్‌లో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 12వ తేదీన ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళుతున్న వృద్ధురాలు నడవడానికి ఇబ్బంది పడుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

టాక్సీ డ్రైవర్ మహిళ దగ్గర ఆగాడు. ఆమె తనను వేదిక వద్ద డ్రాప్ చేయమని కోరింది. అయితే, మహిళ టాక్సీ ఎక్కిన తర్వాత, క్యాబ్ డ్రైవర్ ఆమెను వేరే గమ్యస్థానానికి తీసుకెళ్లాడు. దారిలో ట్యాక్సీలో మహిళపై అత్యాచారం చేసి, ఆ తర్వాత జాతీయ రహదారి 69లోని సుఖ్త్వా వద్ద ఆమెను వదిలి పారిపోయాడు. బేతుల్ కొత్వాలి పోలీసులకు సమాచారం అందడంతో మొదట.. గుర్తు తెలియని నిందితుడిపై అత్యాచారం, కిడ్నాప్ కేసు నమోదు చేసి అతని కోసం వెతకడం ప్రారంభించారు.

సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) సిమల ప్రసాద్ ఆధ్వర్యంలో బేతుల్‌లో ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. జాతీయ రహదారి 69లోని టోల్ ప్లాజా వద్ద అమర్చిన సీసీటీవీ కెమెరా ఫుటేజీ, మహిళ ఇచ్చిన వివరణ ఆధారంగా నిందితుడి గురించి బృందానికి ఆధారాలు లభించాయి. నిందితుడు మనోజ్ మాలవీయ విదిషా జిల్లాకు చెందిన వ్యక్తి, ప్రస్తుతం భోపాల్‌లోని అయోధ్య నగర్‌లో నివసిస్తున్నాడు.మాలవీయ వృత్తిరీత్యా టాక్సీ డ్రైవర్. ఆదివారం భోపాల్ నుంచి నాగ్‌పూర్‌కు ఇద్దరు వైద్యులను దింపేందుకు మనోజ్ టాక్సీలో వెళ్లాడు. బుధవారం నిందితుడికి వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరిచారు.

టిండర్ పరిచయమైన మహిళపై అత్యాచారం.. భారతీయ సంతతి వైద్యుడికి యూకేలో జైలుశిక్ష..

కాగా, జూన్ 11న పంజాబ్ లో దారుణం చోటుచేసుకుంది. నిర్భయ లాంటి కఠిన చట్టాలు ఉన్నప్పటికీ కామాంధులు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. ఓ యువకుడు ఇంట్లో ఒంటరిగా ఉన్న 13 ఏళ్ల బాలికను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన పంజాబ్లోని మౌళి జాగరణ్ లో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మౌళి జాగరణ్ ప్రాంతానికి చెందిన యువకుడు… మార్చి నెలలో పంచకులలోని బుద్దన్ పూర్ గ్రామంలో ఇంట్లో ఉన్న బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత తనను బెదిరించి మరోసారి తన ఇంట్లోనే జూన్ 8వ తేదీన లైంగిక దాడి చేశాడు. అలా పలుమార్లు తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

బాలికలో మార్పులను గమనించిన తల్లిదండ్రులు ఆమెను ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో బాధిత బాలిక, ఆమె తల్లి చండీగడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు యువకుడిపై ఐపీసీ సెక్షన్ 376 (2), 506, పోక్సో చట్టాల కింద కేసు నమోదు చేశారు. అయితే, నిందితుడు బాలుడని అని తెలుస్తుంది. ప్రస్తుతం పరారీలో ఉన్న బాలుడి కోసం గాలిస్తున్నట్లు చండీగఢ్ పోలీసులు వెల్లడించారు.

ఇదిలా ఉంటే కిషన్ గడ్ గ్రామంలో బాలికను లైంగికంగా వేధించినట్లు ఆటోరిక్షా డ్రైవర్ ను అరెస్టు చేశారు. అదే గ్రామంలోని బాలికను నిందితుడు హరిశంకర్ లైంగిక వేధింపులకు గురి చేసినట్లు ఫిర్యాదు అందడంతో అతన్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.