నాలుగేళ్ల చిన్నారిపై దూసుకెళ్లిన ఎద్దు.. తీవ్రగాయాలతో..

రోడ్డు మీద నిలుచున్న చిన్నారిని ఓ ఎద్దు దారుణంగా కుమ్మేసింది. అంతటితో ఆగకుండా ఆ చిన్నారి మీదే కూర్చుండిపోయింది. ఇది గమనించిన స్థానికులు చిన్నారిని బయటకు తీసి ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలీగఢ్ పట్టణంలోని  జరిగింది. 

Bull gores 4-year-old child in Aligarh, video goes viral

హైదరాబాద్ లో వీధి కుక్కల దాడిలో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయిన  అనంతరం.. తెలుగు రాష్ట్రాల్లో వీధి కుక్కల మీద పెద్ద చర్చ జరుగుతోంది. అయితే కుక్కలే కాదు.. బహిరంగ ప్రదేశాల్లో సంచరించే సమయంలో  ఏ జంతువైనా ప్రమాదకరమేనని చెప్పాలి. తాజాగా నెట్టింట్లో ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. నాలుగేళ్ల చిన్నారిపై ఓ ఎద్దు దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది.

అంతటితో ఆగకుండా.. ఆ ఎద్దు ఈ చిన్నారిపై కూర్చుంది. ఈ ఘటనలో చిన్నారికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని అలీగఢ్ పట్టణంలోని తానా గాంధీ పార్క్ సమీపంలో ఉన్న ధనిపూర్ మండిలో జరిగిన దారుణం ఇది. ఈ ఘటన స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కావడంతో జరిగిన సంఘటన వెలుగులోకి వచ్చింది.

సీసీటీవీ పుటేజీ ప్రకారం..ఉత్తరప్రదేశ్ లోని  అలీగఢ్​ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఓ చిన్నారి తన తాతతో కలిసి బయటకెళ్లాడు. ఇంతలో గల్లీ వెంట వచ్చిన ఓ ఎద్దు వచ్చింది. ఆ చిన్నారిని చూసిన ఎద్దు ఒక్కసారిగా మీదికి వచ్చింది. ఆ ఎద్దు దాడిలో ఆ చిన్నారి ఎగిరిపడి.. స్పృహ కోల్పోయాడు. అనంతరం ఆ ఎద్దు చిన్నారి మీదే కూర్చుంది. వెంటనే పక్కన ఇంట్లో నుంచి ఒక వ్యక్తి వచ్చి.. ఆ ఎద్దు కింద ఉన్న చిన్నారిని బయటికి తీశాడు.

అనంతరం చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం చిన్నారి విషమ పరిస్థితిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఘటనపై స్థానికుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మున్సిపల్​ అధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన అధికారులు ఎద్దును బంధించి.. వేరే చోటుకు తరలించారు. చిన్నారిపై ఎద్దు దాడి చేసిన వీడియో.. సామాజిక మాధ్యమాల్లో వైరల్​  గా మారింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios