ఈశాన్య రాష్ట్రాల్లో పరిస్థితులకు కాంగ్రెస్ తప్పిదాలే కారణమని బ్లూ క్రాఫ్ట్ డిజిటల్ పౌండేషన్ సీఈఓ అఖిలేష్ మిశ్రా అభిప్రాయపడ్డారు.
న్యూఢిల్లీ: మణిపూర్ హింసపై దేశ వ్యాప్తంగా ప్రస్తుతం చర్చ జరుగుతుంది. అయితే ఇందుకు దారితీసిన పరిస్థితుల వెనుక కారణాలపై ప్రస్తుతం చర్చ సాగుతుంది. అవిశ్వాసంపై చర్చ సందర్భంగా ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో జరిగిన బాంబు దాడి గురించి మోడీ ప్రస్తావించారు.
ఈశాన్య రాష్ట్రాల్లో పరిస్థితులపై బ్లూక్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్ సీఈఓ అఖిలేష్ మిశ్రా ట్విట్టర్ వేదికగా ప్రస్తావించారు.1950వ దశకంలో నెహ్రు కాశ్మీర్ లో ప్రత్యేక లేదా వేర్పాటు వాద గుర్తిపును రక్షించడంపై దృష్టి పెట్టారని పేర్కొన్నారు. ఈశాన్య ప్రాంతాలను నెహ్రు నిర్లక్ష్యం చేశారని ఆయన ఆరోపించారు. దరిమిలా ఈశాన్య రాష్ట్రాల ప్రజలు ఇబ్బందులుపడ్డారని ఆయన అభిప్రాయపడ్డారు. ఈశాన్య రాష్ట్రాల ఆకాంక్షలు, అవసరం, సాంస్కృతిక గుర్తింపు విస్మరించినట్టుగా ఆయన ఆ ట్వీట్ లో రాసుకొచ్చారు.
అభివృద్ధి లేకపోవడంతో ఈశాన్య రాష్ట్రాల ప్రజల ఆగ్రహానికి కారణంగా అఖిలేష్ మిశ్రా పేర్కొన్నారు.మిజోరాం, నాగాలాండ్ వాసుల్లో అశాంతికి కారణమైందని ఆయన అభిప్రాయపడ్డారు.అయితే దీన్ని సకాలంలో సరిదిద్దలేదని చెప్పారు. పంజాబ్ లో టెర్రరిస్టులు బలపడేందుకు పరోక్షంగా అప్పటి ఇందిరాగాంధీ సర్కార్ సహకరించిందని ఆయన ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఉగ్రవాదులను ప్రోత్సహించారని ఆయన ఆరోపించారు.
1966లో ఇందిరాగాంధీ మిజోరంలో బాంబు దాడి చేసిన సమయంలో 1984 లో ఆపరేషన్ బ్లూస్టార్ అంశాలను ఆయన ప్రస్తావించారు. జాతీయ ప్రయోజనాల కోసం కాకుండా కాంగ్రెస్ నాయకత్వం వైఫల్యాలను దాచేందుకు ఈ ప్రయత్నాలు చేశారని ఆయన విమర్శించారు.
నిన్న అవిశ్వాసంపై చర్చ సందర్భంగా మిజోరంలో బాంబు దాడి అంశాన్ని ప్రధాని మోడీ గుర్తు చేశారు. 1966 మే 5న మిజోరంలో నిస్సహయులైన ప్రజలపై ఇందిరాగాంధీ సర్కార్ బాంబు దాడి చేసిందన్నారు. మిజోరం ప్రజలు దేశ పౌరులు కాదా అని ఆయన ప్రశ్నించారు.ఈ బాధను మిజోరం వాసులు ఇంకా మర్చిపోలేదని మోడీ చెప్పారు.
