గుజరాత్‌లోని జునాగఢ్‌లో ఓ రెండు అంతస్థుల భవనం కూలిపోవయింది. భవనం శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయారు.
గుజరాత్‌లోని జునాగఢ్‌లో ఓ రెండు అంతస్థుల భవనం కూలిపోవయింది. భవనం శిథిలాల కింద నలుగురు చిక్కుకుపోయారని తెలుస్తోంది. నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఒకటైన దాతర్ రోడ్‌లోని కడియావాడ్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. కూలిపోయిన భవనం పాతదని.. భారీ వర్షాల కురుస్తుండటంతో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుందని చెబుతున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డిఆర్‌ఎఫ్), స్థానిక అగ్నిమాపక సిబ్బంది, పోలీసు సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్‌లో నిమగ్నమయ్యారు. శిథిలాల్లో చిక్కుకున్నవారిని బయటకు తీసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. శిథిలాలను తొలగించేందుకు బుల్‌డోజర్లను కూడా వినియోగిస్తున్నామని స్థానిక అధికారులు తెలిపారు. తరలించేందుకు ఘటనా స్థలంలో అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచామని చెప్పారు.
ఇక, గుజరాత్ రాష్ట్రంలో గత రెండు రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. గుజరాత్ మరింతగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ మరింత అంచనా వేసింది. గుజరాత్ ప్రాంతంలోని ఆనంద్, వడోదర, భరూచ్, సూరత్, నవ్‌సారి, సౌరాష్ట్ర-కచ్‌లోని జామ్‌నగర్, పోర్ బందర్, జునాగఢ్, అమ్రేలీ, గిర్ సోమనాథ్, కచ్‌తో పాటు డయ్యూలో రాబోయే 5 రోజులలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గుజరాత్ తీరంలోని మత్స్యకారులు జూలై 26 వరకు సముద్రంలోకి వెళ్లవద్దని భారత వాతావరణ విభాగం, ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ హెచ్చరించింది.
