చెన్నైలో కుప్పకూలిన భవనం.. ఒకరి మృతి.. శిథిలాల కింద 50 మంది

First Published 22, Jul 2018, 11:01 AM IST
building collapse in chennai
Highlights

తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది... పాత మహాబలిపురంలో నిర్మాణంలో ఉన్న నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలింది.. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా.. శిధిలాల కింద 50 మంది వరకు చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది

తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది... పాత మహాబలిపురంలో నిర్మాణంలో ఉన్న నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలింది.. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా.. శిధిలాల కింద 50 మంది వరకు చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది. రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.. ఉన్నట్లుండి పేకమేడలా భవనం కూలిపోవడంతో అక్కడున్న స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.. వెంటనే అక్కడికి చేరుకుని శిథిలాల కింద చిక్కుకున్న క్షతగాత్రులను బయటకు తీశారు..

సమాచారం అందుకున్న అధికారులు.. ఫైరింజన్లు, జేసీబీల సాయంతో శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసి ఆసుపత్రికి తరలిస్తున్నారు.. ఇప్పటి వరకు 17 మందిని రక్షించినట్లుగా తెలుస్తోంది. వీరంతా భవన నిర్మాణంలో పనిచేస్తోన్న కూలీలే... దక్షిణ తమిళనాడు ప్రాంతం నుంచి వారు ఇక్కడికి వచ్చినట్లుగా సమాచారం.. కాగా, నిన్న పెద్ద మొత్తంలో ఇనుప సామాగ్రిని భవనం పైకి తీసుకెళ్లారని.. ఆ బరువు వల్లే భవనం కుప్పకూలిందని స్థానికులు చెబుతున్నారు. 

loader