Asianet News TeluguAsianet News Telugu

Budget 2024: గత బడ్జెట్ లోని ఐదు ప్రధాన అంశాలివే..

ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్-మేలో సార్వత్రిక ఎన్నికలు ఉండబోతున్న నేపథ్యంలో ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ‘మధ్యంతర’ బడ్జెట్‌ను సమర్పించనున్నారు.

Budget 2024: Five major announcements of last budget - bsb
Author
First Published Jan 25, 2024, 3:42 PM IST | Last Updated Jan 25, 2024, 3:42 PM IST

ఢిల్లీ : ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ రెండోసారి నరేంద్ర మోదీ ప్రభుత్వ చివరి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అయితే, ప్రభుత్వం ఈ సంవత్సరం ఏప్రిల్-మేలో సాధారణ ఎన్నికలను ఎదుర్కొంటుంది. రాబోయే బడ్జెట్ 'మధ్యంతర' బడ్జెట్ గా ఉండనుంది. 

 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తి బడ్జెట్‌ను జూలైలో ప్రవేశపెట్టనున్నారు. భారతదేశంలో, ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1న ప్రారంభమై, మరుసటి సంవత్సరం మార్చి 31న ముగుస్తుంది. 

ఈ క్రమంలో ఒక్కసారి గత సంవత్సరం బడ్జెట్ లో చేసిన ఐదు ప్రధాన ప్రకటనలను గమనిస్తే...

ఆదాయపు పన్ను
పాత పన్ను విధానంలో ఎలాంటి మార్పులు చేయలేదు. అయితే ఆర్థిక మంత్రి కొత్త విధానంలో పన్ను శ్లాబులను సవరించారు. దీని ప్రకారం, కొత్త రిజైమ్ లో ప్రాథమిక మినహాయింపు పరిమితి రూ. 2.5 లక్షల నుండి రూ. 3 లక్షలకు పెంచబడింది. అయితే, పన్ను రాయితీ రూ. 2 లక్షల నుండి రూ. 7 లక్షలకు పెరిగింది. అలాగే, పాత రిజైమ్ లో అందుబాటులో ఉన్న రూ.50,000 స్టాండర్డ్ డిడక్షన్ కొత్తదానికి కూడా పొడిగించబడింది. దీంతోపాటు, కొత్త రిజైమ్ డిఫాల్ట్ పన్ను వ్యవస్థగా చేయబడింది.

Interim Budget 2024 : సొంతిళ్లు కొనాలనుకుంటున్నారా? ఈ బడ్జెట్ లో మీకెలాంటి లాభాలున్నాయంటే..

క్యాపెక్స్ పెంపు 
వరుసగా మూడో సంవత్సరం, మూలధన పెట్టుబడి వ్యయం పెద్ద ఎత్తున పెరిగింది. రూ.10 లక్షల కోట్లకు 33% పెరిగింది. స్థూల దేశీయోత్పత్తి (GDP)లో మొత్తం మూలధన పెట్టుబడి వ్యయం దాదాపు 3.3%.

ఆరోగ్యం, విద్య : 
ఈ రంగానికి రూ.89,155 కోట్లు కేటాయించారు. ఆర్థిక మంత్రి సీతారామన్ 2047 నాటికి సికిల్ సెల్ అనీమియాను నిర్మూలించే మిషన్‌ను ప్రకటించారు. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2014 నుండి స్థాపించబడిన 157 మెడికల్ కాలేజీలకు అదనంగా 157 కొత్త నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేయనున్నట్లు ఆమె తెలిపారు.

ప్రధానమంత్రి ఆవాస్ యోజన  
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కోసం ఖర్చు 65% పెంచారు. దీంతో ఇది మొత్తం రూ.79,000 కోట్లకు చేరుకుంది. మునుపటి బడ్జెట్‌లో, ఈ కేటాయింపు రూ. 48,000 కోట్లు.

వ్యవసాయం
గ్రామీణ ప్రాంతాల్లో యువ పారిశ్రామికవేత్తల ద్వారా స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు, వ్యవసాయ యాక్సిలరేటర్ ఫండ్‌ను ప్రకటించారు. ఇంకా, పశుపోషణ, పాడి పరిశ్రమ, మత్స్య రంగాలపై దృష్టి సారించి వ్యవసాయ రుణ లక్ష్యాన్ని రూ. 20 లక్షల కోట్లకు పెంచారు.

ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన కింద కొత్త ఉప పథకం కూడా రూ.6,000 కోట్ల లక్ష్య పెట్టుబడితో మత్స్యకారులు, చేపల విక్రేతలు, ఎంఎస్ఎంఈల (సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు) కార్యకలాపాలను మరింత ప్రారంభించడానికి వీలుగా ఆవిష్కరించబడింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios