Budget 2022: జనవరి 31 నుంచి బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. గత ఏడాది పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సమయంలో అనుసరించిన క‌రోనా ప్రోటోకాల్‌ల మాదిరిగానే అధికారులు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. అయితే, 17వ లోక్‌సభ 8వ సెషన్‌లో మొదటి రెండు రోజులు జ‌న‌వ‌రి 31, ఫిబ్రవరి 1న జీరో అవ‌ర్ ఉండ‌ద‌ని పార్ల‌మెంట్ వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

Budget 2022: జనవరి 31 నుంచి బడ్జెట్‌ సమావేశాలు (Parliament Budget session 2022) ప్రారంభం కానున్నాయి. గతేడాది పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సమయంలో అనుసరించిన క‌రోనా ప్రోటోకాల్‌ల మాదిరిగానే అధికారులు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. అయితే, 17వ లోక్‌సభ 8వ సెషన్‌లో మొదటి రెండు రోజులు జ‌న‌వ‌రి 31, ఫిబ్రవరి 1న జీరో అవ‌ర్ (Zero Hour) ఉండ‌ద‌ని పార్ల‌మెంట్ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. పార్ల‌మెంట్ స‌మావేశాలు ప్రారంభ‌మైన జ‌న‌వ‌రి 31వ‌ తేదీన ఉభ‌య‌స‌భ‌ల‌ను ఉద్దేశించి రాష్ట్ర‌ప‌తి రామ్ నాథ్ కోవింద్ ప్ర‌సంగించ‌నున్నారు. రాష్ట్రప‌తి ప్ర‌సంగం అనంత‌రం స‌భ వాయిదా ప‌డుతుంది. ఈ నేప‌థ్యంలో జీరో అవ‌ర్ ఉండ‌ద‌ని పార్ల‌మెంట్ నిర్వాహ‌క వ‌ర్గాలు వెల్ల‌డించాయి. అలాగే, ఫిబ్ర‌వ‌రి ఒక‌టో తేదీన కేంద్ర బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెడుతుంది. ఉద‌యం 11 గంట‌ల‌కు కేంద్ర ఆర్థిక మంత్రి మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ కేంద్ర ఆర్థిక బ‌బ్జెట్‌-2022ను ప్ర‌వేశ‌పెడుతారు. బ‌డ్జెట్ (Budget) ప్ర‌వేశ‌పెట్టిన తర్వాత స‌భ వాయిదా ప‌డుతంది. ఈ కార‌ణంగా ఫిబ్ర‌వ‌రి ఒక‌టో తేదీన కూడా జీరో అవ‌ర్ ఉండ‌ద‌ని పార్ల‌మెంట్ వ‌ర్గాలు పేర్కొన్నాయి. అయితే, పార్ల‌మెంట్ స‌మాశాలు ప్రారంభ‌మైన రెండు రోజుల త‌ర్వాత అంటే రెండో తేదీ నుంచి జీరో అవ‌ర్ (Zero Hour) ఉంటుంద‌ని తెలిపాయి. 

కాగా, ఫిబ్రవరి 2 నుండి ప్రారంభమయ్యే మూడు రోజుల పాటు ఉభయ సభలు - లోక్‌సభ, రాజ్యసభల‌ల్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చించే అవకాశం ఉంది. ఇక ఫిబ్రవరి 2,3,4,7 తేదీల్లో లోక్‌సభలో బడ్జెట్ పై చ‌ర్చ‌ను చేపట్టవచ్చనీ, రాజ్యసభలో ఫిబ్రవరి 2,3, 7, 8 తేదీల్లో చర్చలు చేపట్టవచ్చని సంబంధిత వ‌ర్గాలు పేర్కొన్నాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చకు ప్రధాని నరేంద్ర మోడీ ఫిబ్రవరి 7న లోక్‌సభలో, 8న రాజ్యసభలో సమాధానమివ్వవచ్చని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఇక‌ రాష్ట్రపతి ప్రసంగంలో కేంద్ర ప్రభుత్వ విధానాలు, ప్రాధాన్యతలు, ప్రణాళికలను వివ‌రించ‌నున్నారు. ఈ ప్రసంగం గత సంవత్సరంలో ప్రభుత్వం చేసిన పనిని హైలైట్ చేయ‌నున్నారు. అదే సమయంలో దాని ఎజెండా కోసం ఒక ఫ్రేమ్‌వర్క్‌ను అందించ‌నున్నారు. 

ఇదిలావుండ‌గా, దేశంలో క‌రోనా విజృంభ‌ణ కొన‌సాగుతున్న‌ది. నిత్యం ల‌క్ష‌ల్లో కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. క‌రోనా విజృంభ‌ణ ప‌రిస్థితుల మ‌ధ్యే పార్ల‌మెంట్ బ‌డ్జెట్ స‌మావేశాలు జ‌ర‌గ‌నున్నాయి. ఇప్ప‌టికే 800 మందికి పైగా పార్ల‌మెంట్ సిబ్బంది క‌రోనా (Covid-19) బారిన‌ప‌డ‌టం, ప‌లువురు ఎంపీలు సైతం క‌రోనా పాజిటివ్ గా ప‌రీక్షించ‌డంతో ఈ సారి జ‌ర‌గ‌బోయే పార్ల‌మెంట్ బ‌డ్జెట్ స‌మావేశాలు ((Parliament Budget session 2022)).. గత ఏడాది పార్లమెంట్ వర్షాకాల సమావేశాల (Budget session) సమయంలో అనుసరించిన ప్రోటోకాల్‌ను అనుస‌రించి నిర్వ‌హించ‌నున్నామ‌ని సంబంధిత వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఉభ‌య స‌భ‌లు ఒక‌రోజులో రెండు వేర్వేరు షిప్టుల‌లో ప‌నిచేస్తాయ‌ని తెలిపాయి. 

పార్ల‌మెంట్ బ‌డ్జెట్ స‌మావేశాల్లో (Parliament Budget session 2022) భాగంగా లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ‌లు ఒకే రోజు రెండు వేర్వేరు షిప్టుల్లో ప‌నిచేస్తాయ‌ని పార్ల‌మెంట్ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. రాజ్య‌స‌భ‌ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు లేదా ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సమావేశమవుతుందని తెలిపాయి. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు లోక్‌సభ సమావేశమవుతుంది. దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి థ‌ర్డ్ వేవ్ ప్ర‌భావం కొన‌సాగుతున్న న‌నేప‌థ్యంలో పార్ల‌మెంట్ నిర్వ‌హ‌ణ వ‌ర్గాలు ఈ నిర్ణ‌యం తీసుకున్నాయి. జనవరి 31 నుంచి బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. గత ఏడాది పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సమయంలో అనుసరించిన ప్రోటోకాల్‌ల మాదిరిగానే అధికారులు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. సెప్టెంబరు 2020లో జరిగిన పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాల నేప‌థ్యంలో తొలిసారిగా పార్లమెంటరీ కార్యకలాపాలు కఠినమైన కోవిడ్-19 ప్రోటోకాల్ చ‌ర్య‌లు తీసుకున్నారు. రోజు ప్రథమార్థంలో రాజ్యసభ, ద్వితీయార్థంలో లోక్‌సభ సమావేశమయ్యాయి. సామాజిక దూరాన్ని పాటిస్తూ.. సభ్యులు రెండు ఛాంబర్లలో కూర్చున్నారు.