Union budget 2022: సామాన్యులకు గుండు సున్నా.. ఇది పెగాసస్ స్పిన్ బడ్జెట్: మమతా బెనర్జీ
Union budget 2022: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) మంగళవారం పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అయితే, ఈ బడ్జెట్ పై ప్రతిపక్షాలు స్పందిస్తూ.. విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందిస్తూ.. ఈ బడ్జెట్ లో సామాన్యులకు గుండు సున్నా చూపించారనీ, ఇది పెగాసస్ స్పిన్ బడ్జెట్ అంటూ విమర్శలు గుప్పించారు.

"సామాన్యులకు ఈ బడ్జెట్‌లో గుండు సున్నా చూపించారు. సామాన్య ప్రజలు ఓ వైపు నిరుద్యోగం, ద్రవ్యోల్బణంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే, ప్రభుత్వం పెద్ద పెద్ద హామీలు ఇచ్చి చివరకు బడ్జెట్‌లో ఎటువంటి కేటాయింపులు చేయలేదు. ఇది ఒక పెగాసస్ స్పిన్ బడ్జెట్టు" అని మమతా బెనర్జీ ట్వీట్ చేశారు.
కాంగ్రెస్ నేతలు సైతం బడ్జెట్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. బడ్జెట్ ధనవంతులకు మాత్రమేనని, ఇందులో పేదలకు ఏమీ లేదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే విమర్శించారు.
కేంద్ర బడ్జెట్‌పై కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ సైతం విమర్శలు గుప్పించారు. ఈ బడ్జెట్ మోడీ గవర్నమెంట్ జీరో బడ్జెట్ అంటూ విమర్శించారు. "ఓ అక్షరం వచ్చే ప్లేస్‌లో సున్నాను టైప్ చేశారు. అల్టిమేట్‌గా ఇది సున్నా బడ్జెట్.. ఉద్యోగులకు, మధ్య తరగతి ప్రజలకు, పేదవాళ్లకు, యూత్, రైతులు, ఎంఎస్ఎంఈకి ఈ బడ్జెట్‌లో ఎటువంటి కేటాయింపులు లేవు" అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.