సీనియర్ సిటిజన్లకు బంఫర్ ఆఫర్: వ్యక్తిగత ఆదాయ పన్ను యథాతథం

వ్యక్తిగత ఆదాయపన్ను చెల్లింపుల్లో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి మార్పులు చేయలేదు. గత ఏడాదిలో ప్రకటించిన ఆదాయ పన్ను స్లాబ్ ను ఈ ఏడాది కూడా కేంద్రం కొనసాగించనుంది. 

Budget 2021 : No change in Income Tax slabs ln


న్యూఢిల్లీ: వ్యక్తిగత ఆదాయపన్ను చెల్లింపుల్లో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి మార్పులు చేయలేదు. గత ఏడాదిలో ప్రకటించిన ఆదాయ పన్ను స్లాబ్ ను ఈ ఏడాది కూడా కేంద్రం కొనసాగించనుంది. మరో వైపు సీనియర్ సిటిజన్లకు కేంద్రం బంఫర్ ఆఫరిచ్చింది.

గత ఏడాది ఏ రకమైన వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపుకు పరిమితులను విధించిందో ఈ ఆర్ధిక సంవత్సరంలో కూడా అదే తరహాలో ట్యాక్స్ ను అమలు చేయనున్నారు. పన్ను శ్లాబుల్లో కూడా ఎలాంటి మార్పులు చేయలేదు. గత ఏడాది శ్లాబు విధానాన్నే ఈ ఏడాది కూడ కొనసాగించనుంది కేంద్రం.

also read:భీమా రంగంలో విదేశీ పెట్టుబడులకు పెద్దపీట: 49 నుండి 74 శాతానికి ఎఫ్‌డీఐలకు ఓకే

సీనియర్ సిటిజన్లకు కేంద్ర ప్రభుత్వం బంపర్ ఆఫరిచ్చింది. 75 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లు ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాల్సిన అవసరం లేదని కేంద్రం ప్రకటించింది.

సోమవారం నాడు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రసంగంలో సీనియర్ సిటిజన్ల గురించి ప్రస్తావిస్తూ ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాల్సిన అవసరం లేదని కేంద్రం తేల్చి చెప్పింది. గతంలో 75 ఏళ్లు దాటిన వారు కూడ  ట్యాక్స్ చెల్లించాల్సిన పరిస్థితి ఉండేది.. పెన్షన్, వడ్డీ ఆదాయం ఆధారంగా ఐటీని మినహాయించనున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios