తన తల్లి దగ్గర నుంచి తనకు రూ.కోటిన్నర ఇవ్వాలంటూ... ఓ  వ్యక్తి కోర్టుకి ఎక్కాడు. తనని కాదని... తన తల్లి మరో వ్యక్తిని పెళ్లి చేసుకుందని...  కనీసం తనను కొడుకు గా కూడా ప్రపంచానికి పరిచయం చేయడం లేదని అతని వాదన. ఈ క్రమంలో తనను రెండేళ్ల వయసు ఉన్నప్పుడే వదిలించుకున్నందుకు పరిహారంగా రూ.కోటిన్నర ఇప్పించండి అంటూ కోర్టులో పిటిషన్ వేశాడు. కాగా... త్వరలోనే న్యాయస్థానం ఈ పిటిషన్ పై తీర్పు ఇవ్వనుంది.  ఈ సంఘటన ముంబయిలో చోటుచేసుకుంది.

పిటిషనర్ వాదన ప్రకారం.... అతని పేరు శ్రీకాంత్ సబాని(40). మేకప్ ఆర్టిస్ట్ గా పనిచేస్తున్నాడు. ఇతను గతేడాది డిసెంబర్ లో తనకు న్యాయం చేయాలంటూ కోర్టును ఆశ్రయించాడు. కాగా... కోర్టులో అతను కన్న తల్లిపై వినిపించిన వాదన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. 

పూర్తి వివరాల్లోకి వెళితే..   శ్రీకాంత్ సబానీ తల్లికి తొలుత దీపక్ సబానీతో వివాహమైంది. వీరు పూణేలో ఉండేవారు. కాగా... వారికి 1979 ఫిబ్రవరిలో ఓ కుమారుడు జన్మించాడు. అతనే శ్రీకాంత్ సబాని. కాగా... శ్రీకాంత్ కి రెండేళ్లు వచ్చిన తర్వాత అతని తల్లి పని నిమిత్తం ముంబయికి వెళ్లింది. సినీ పరిశ్రమలో తనకంటూ గుర్తింపు సంపాదించుకోవాలని ఆమె అనుకుంది. 

Also Read శర్వానంద్ మహానుభావుడు సీన్ రిపీట్.. భర్తకు భార్య విడాకులు

అందుకు ఆమెకు భర్త, కొడుకు అడ్డుగా అనిపించాడు. భర్తకు దూరమయ్యింది. కొడుకును తీసుకొని  1981లో ముంబయికి రైలులో వెళ్లింది.  కాగా.. ముంబయికి చేరుకున్న తర్వాత ఆమె తన కొడుకును రైలులోనే వదిలేసి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ బాబుని చూసిన ఓ రైల్వే అధికారి.... వివరాలు కనుక్కొని.. ఇంటికి  చేర్చాడు.

అప్పటి నుంచి బాలుడు ఆమె అమ్మమ్మ దగ్గర పెరిగాడు. అయితే.... ఇటీవల కొద్ది సంవత్సరాల క్రితమే ఆమెకు తనకు కన్న తల్లి గురించి తెలిసింది. వెంటనే ఫోన్ నెంబర్ తీసుకొని ఆమెతో ఫోన్లో మాట్లాడాడు. ఆమే తన అసలు తల్లి కూడా ఆమె అంగీకరించింది.

ఆ తర్వాత సంతోషంతో అతను తన తల్లి వద్దకు వెళ్లాడు. అప్పటికే ఆమెకు వేరే వ్యక్తితో పెళ్లై... పిల్లలు ఉన్నారు. తనకు ఇప్పుడు సొసైటీలో మంచి పేరు ఉంది కాబట్టి... తనను కొడుకుగా గుర్తించలేదన్నారు. అందరి ముందు... తన రెండో భర్త సంతానం ముందు తనను సొంత కొడుకుగా చెప్పుకోలేనని చెప్పందిని శ్రీకాంత్ తెలిపాడు.

ఈ క్రమంలో అతను గతేడాది డిసెంబర్ లో కోర్టును ఆశ్రయించాడు. అతని తరపు వాదనలు విన్న న్యాయస్థానం.. తీర్పును వాయిదా వేసింది. మరోసారి కోర్టుకి హియర్ రింగ్ కి వస్తే... న్యాయమూర్తి తీర్పు ఇచ్చే అవకాశం ఉంది.