బీఎస్పీ మాయావతి మత మార్పిళ్ల అంశంపై ఈ రోజు ట్వీట్ చేశారు. క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు చెబుతూ ఈ మత మార్పిళ్లపై వివాదం ముదరడం సరికాదని, ఆందోళనకరమని పేర్కొన్నారు.
న్యూఢిల్లీ: బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) చీఫ్, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం మాయావతి ఆదివారం కీలక వ్యాఖ్యలు చేశారు. మతం ఆధారంగా జరుగుతున్న రాజకీయాలపై ఆమె అటాక్ చేశారు. క్రిస్మస్ సందర్భంగా ఆమె ట్విట్టర్ వేదికగా చేసిన పోస్టుల్లో మత మార్పిళ్ల అంశాన్ని ప్రస్తావించారు. తమ మార్పిళ్లపై జరుగుతున్న రాజకీయం సరైంది కాదని, ఆందోళనకరమని పేర్కొన్నారు.
మత మార్పిళ్ల విషయమై దేశవ్యాప్తంగా కలకలం రేపడం ఆందోళనకరం అని, సరైంది కాదని ఆమె ట్వీట్ చేశారు. అది ఏదైనా సరే.. మతం మారడమైనా.. మతం మార్పించడమైనా బలవంతంగా జరిగితే, దురుద్దేశంతో జరిగితే అది తప్పే అని పేర్కొన్నారు. కాబట్టి, ఈ అంశాన్ని సరైన దృష్టితో చూడాల్సిన అవసరం ఉన్నదని, సరిగ్గా అర్థం చేసుకోవాల్సి ఉంటుందని వివరించారు. కట్టర్ రాజకీయ విధానాలతో దేశానికి లాభం కంటే నష్టమే ఎక్కువ అని తెలిపారు.
Also Read: క్రిస్మస్ వేడుకల సందర్భంగా మతమార్పిడులు జరగకూడదు - అధికారులకు యూపీ సీఎం యోగి ఆదేశాలు
దేశంలోని క్రైస్తవులకు ఆమె క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. దేశవ్యాప్తంగా అన్ని మతాల ప్రజలు శాంతియుతంగా, సామరస్యంగా మెలుగుతారని ఆశిస్తున్నట్టు వివరించారు.
లౌకిక రాజ్యాంగం అమలు అవుతున్న మన దేశంలో ఇతర మతస్తుల లాగే వీరంతా సంతోషమయ, శాంతియుత జీవితం గడుపుతారని కోరుకుంటున్నట్టు తెలిపారు.
