బహుజన్ సమాజ్‌పార్టీ (బీఎస్పీ) అధినేత మాయావతి ప్రముఖ సోషల్ మీడియా వేదిక ట్విట్టర్ లో అడుగుపెట్టారు. మీడియా, ప్రజలకు అందుబాటులో ఉండేందుకు తాను ట్విట్టర్ లో చేరుతున్నట్లు ఆమె ఈ రోజు ప్రకటించారు.

త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. మాయవతి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ‘‘బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, మాజీ ఎంపీ మాయావతి తొలిసారి ట్విట్టర్లో చేరాలని నిర్ణయించుకున్నారు. ప్రజలు, మీడియాకు చేరువలో ఉండడంతో పాటు... జాతీయ రాజకీయాలు, రాజకీయ ప్రాధాన్యతలపై తన ఆలోచనలను ఆమె ట్విటర్ ద్వారా పంచుకోనున్నారు...’’ అని బీఎస్పీ వెల్లడించింది.
 
కాగా తన తొలి ట్వీట్‌లో మాయావతి స్పందిస్తూ.. ‘‘సోదరీ, సోదరులకు హలో... ట్విట్టర్ కుటుంబానికి నన్ను నేను పరిచయం చేసుకుంటున్నాను. ఈ అధికారిక ఖాతా ద్వారా ట్విట్టర్లోకి తొలిసారి వస్తున్నాను. ముందు ముందు నా అభిప్రాయాలు, సందేశాలు ఇందులోనే వస్తాయి. అందరికీ శుభాకాంక్షలు. ధన్యవాదాలు..’’ అని పేర్కొన్నారు