కేవలం రూ.149కే

ప్రముఖ టెలికాం సంస్థలు ఎయిర్ టెల్, జియో, ఐడియా, వొడాఫోన్లతో పోటీపడేందుకు ప్రభుత్వ టెలికాం రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే వినియోగదారులను ఆకట్టుకునేందుకు విభిన్న ఆఫర్లను తీసుకువస్తోంది. 

తాజాగా బీఎస్ఎన్ఎల్ ప్రకటించిన ఓ ఆఫర్ వినియోగదారులకు తెగ నచ్చేస్తోంది. కేవలం రూ.149కే రోజుకి 4జీబీ డేటా ఇవ్వనున్నట్ల కంపెనీ ప్రకటించింది. దీని వేలిడిటీ 28 రోజుల పాటు ఉంటుంది. 

‘ఫిఫా వరల్డ్‌ కప్‌ స్పెషల్‌ డేటా ఎస్‌టివి 149’ పేరుతో సంస్థ ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా రోజుకు 4జిబి 3జి డేటా ఉచితంగా లభిస్తుంది. ఈ నెల 14 నుంచి జూలై 15 వరకు ఈ పథకం అమల్లో ఉంటుంది. అయితే ఎస్‌టివి 149తో రీచార్జ్‌ చేసుకుంటే ఉచిత వాయిస్‌ కాల్స్‌, ఎస్‌ఎంఎస్‌ ప్రయోజనాలు వర్తించవు. అన్ని బిఎ్‌సఎన్‌ఎల్‌ సర్కిల్స్‌లో ఈ ప్లాన్‌ అందుబాటులో ఉంటుంది.