పాక్ పై ప్రతీకారం తీర్చుకునే నేపథ్యంలో... ఇటీవల భారత ఆర్మీ పాక్ స్థావరాలను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ ఎఫెక్ట్..వచ్చే ఎన్నికలపై పడుతుందని కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప అభిప్రాయపడ్డారు. ఈ దెబ్బతో తమ పార్టీకి కర్ణాటకలో 22సీట్లు వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా.. దేశ రక్షణ కోసం చేసిన దాడులను రాజీకాయలతో ముడిపెట్టడంతో.. యడ్యూరప్ప కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి.

‘మన జవాన్లను 40మందిని పొట్టనబెట్టుకున్నందుకు పాకిస్తాన్‌కు తగిన బుద్ది చెప్పడంలో మోదీ తన సత్తా ఏంటో చూపించారు. చిందిన ప్రతీ నెత్తుటి చుక్కకు ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పిన మోదీ.. చెప్పినట్టుగానే దాన్ని చేసి చూపిస్తున్నాడు. ప్రతిపక్షాలతో సహా అందరూ దీన్ని స్వాగతిస్తున్నారు. పాక్‌పై దాడులతో యువతలో నూతనోత్తేజం రగులుతోంది. ఈ దెబ్బతో కర్ణాటకలో 28 లోక్‌సభ స్థానాలకు 22 పైచిలుకు స్థానాల్లో బీజేపీ గెలుస్తుంది.’ అని యడ్యూరప్ప పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా దుమారం రేపాయి.