Asianet News TeluguAsianet News Telugu

రామయ్యపై భక్తి: అయోధ్యలో మందిరం కోసం 151 నదుల నీళ్లు.. 52 ఏళ్ల నుంచి సేకరణ

సుప్రీంకోర్టు తీర్పుతో దశాబ్ధాల రామ మందిర నిర్మాణం కోసం చేసిన పోరాటం ఫలించింది. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ప్రధాని నరేంద్రమోడీ ఆగస్ట్ 5న శంకుస్థాపన చేయనున్నారు

brothers who collected water from 151 rivers in ayodhya ahead of ram temple
Author
New Delhi, First Published Aug 2, 2020, 9:54 PM IST

సుప్రీంకోర్టు తీర్పుతో దశాబ్ధాల రామ మందిర నిర్మాణం కోసం చేసిన పోరాటం ఫలించింది. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ప్రధాని నరేంద్రమోడీ ఆగస్ట్ 5న శంకుస్థాపన చేయనున్నారు. ఈ క్రమంలో 70 ఏళ్లు కలిగిన ఇద్దరు సోదరులు రాధే శ్యామ్ పాండే, షాబ్ వైజ్ఞానిక్ మహాకవి త్రిఫాల రాముడిపై తమ భక్తిని చాటుకున్నారు.

వీరు 1968 నుంచి శ్రీలంకలోని పదహారు ప్రదేశాలు, ఎనిమిది నదులు, మూడు సముద్రాల ద్వారా రామ మందిర నిర్మాణానికి వీటిని సేకరించారు. ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాధే శ్యామ్ పాండే స్పందిస్తూ.. రామ మందిర నిర్మాణ ప్రారంభోత్సవానికి భారత్, శ్రీలంక నదుల నుంచి నీటిని సేకరించడం తన కళని రాధే శ్యామ్ తెలిపారు.

Also Read:మోడీ రాక, అయోధ్యలో భారీ భద్రత: పోలీసులకు కరోనా టెస్టులు.. డ్రోన్లతో నిఘా

శ్రీరాముని అనుగ్రహంతోనే తన లక్ష్యం నెరవేరిందని ఆయన చెప్పారు. మొత్తంగా 151 నదులు.. వీటిలో 8 పెద్ద నదులు, 3 సముద్రాల నుంచి రామమందిర నిర్మాణానికి నీటిని సేకరించామని శ్యామ్ అన్నారు.

ఇక శ్రీలంకలోని 16 చోట్ల నుంచి మట్టిని కూడా సేకరిస్తున్నట్లు ఆయన చెప్పారు. దీనిని కొన్ని దశాబ్ధాలుగా కొనసాగిస్తూ వస్తున్నట్లు ఆ సోదరులు వెల్లడించారు. 1968 నుంచి 2019 వరకు వివిధ మార్గాల ద్వారా నీటిని సేకరించామని ఇద్దరు సోదరులు చెప్పారు. కాలినడకన, సైకిల్, రైల్, విమానం ఇలా అనేక మార్గాల్లో నీటిని, మట్టిని సేకరించడానికి వెళ్లినట్లు వారు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios