Asianet News TeluguAsianet News Telugu

వదినెతో మరిది ఎఫైర్.. అక్రమ సంబంధాన్ని దాచడానికి ఇద్దరు కలిసి భర్త హత్య

ఉత్తరప్రదేశ్‌లో వదినెతో మరిది ఎఫైర్ పెట్టుకున్నాడు. ఆ తర్వాత వదినెతో ప్లాన్ వేసి అన్ననే చంపేశాడు. పోలీసులు దర్యాప్తులో వదినెతో తనకు అక్రమ సంబంధం ఉన్నదని ఒప్పుకున్నాడు. వీరిద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు.
 

brothers illicit affair with sister in law kills her husband in uttar pradesh
Author
First Published Nov 14, 2022, 12:56 AM IST

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. అనైతిక, సంబంధ బాంధవ్యాల విలువలను మట్టిలో గలిపే ఘటన వెలుగులోకి వచ్చింది. తల్లిలా చూడాల్సిన వదినెతో ఓ మరిది ఎఫైర్ పెట్టుకున్నాడు. వీరిద్దరూ కొన్నాళ్లుగా రహస్యంగా వివాహేతర సంబంధాన్ని కొనసాగించారు. కానీ, ఇటీవలే ఈ విషయం ఆ వివాహిత భర్తకు తెలిసిపోయింది. దీంతో భర్తనే పక్కకు తొలగించాలని పథకం వేశారు. అనుకున్నట్టే ఆ వివాహిత తన మరిదితో కలిసి భర్తను హతమార్చింది.

బిహార్‌లోని సీతామర్హి జిల్లాకు చెందిన 35 ఏళ్ల అయాజ్ ఎంబ్రాయిడరీ వేసే పని చేసేవాడు. ఆయన తన భార్య సజ్రా, ముగ్గురు పిల్లలతో ఘజియాబాద్‌కు షిఫ్ట్ అయ్యారు. ఇక్కడే ట్రోనికా సిటీ పోలీసు స్టేషన్ ఏరియాలో ఖుషల్ పార్క్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. అయాజ్‌కు 21 ఏళ్ల తమ్ముడు అమీర్ ఉన్నాడు.

Also Read: Extramarital Affair: తండ్రి చనిపోయాడు.. తల్లి వివాహేతర సంబంధం.. కొడుకు ఏం చేశాడంటే?

అమీర్ తన వదినె సజ్రాతో అక్రమ సంబంధాన్ని దాచి ఉంచడానికి అన్నయ్యనే హతమార్చాలని ప్లాన్ వేశాడు. నవంబర్ 11, 12వ తేదీల మధ్యలో రాత్రి, సుమారు 3 గంటల ప్రాంతంలో అయాజ్ ఇంటి నుంచి పెద్ద అరుపు వినిపించింది. అప్పుడ బహుశా అయాజ్‌ను అమీర కత్తితో గొంతు కోసి చంపేశాడు. స్థానికులకూ ఆ అరుపు వినిపించింది. వారు మృతుడి మరో సోదరుడు నియాజ్‌కు సమాచారం అందించారని ఎష్పీ (రూరల్) ఇరాజ్ రాజా తెలిపారు. నియాజ్ వెంటనే అయాజ్ ఇంటికి చేరుకున్నాడు. సుమారు 3.30 గంటల ప్రాంతంలో కనీసం 25 నిమిషాల పాటు డోర్ కొట్టాడు. కానీ, ఎవరూ ఆ డోర్ ఓపెన్ చేయలేదు.

అప్పుడు ఒక వ్యక్తి ఇంటి పైకప్పుకు ఎక్కుతున్నట్టు చూశాడు. పైకి మెట్లు ఎక్కి నల్లటి చీకటి వీధిలోకి దూకి ఆ వ్యక్తి అదృశ్యమయ్యాడు. నియాజ్ ఆ ఇంటిలోకి వెళ్లి చూడగా తన సోదరుడు రక్తపు మడుగులో కనిపించాడు. కాగా, సజ్రా మాత్రం తనకు ఏ అరుపులూ వినిపించలేవని పోలీసులతో బుకాయించింది.

Also Read: అక్ర‌మ సంబంధాలు వ‌ద్దంటోంద‌ని భార్య‌ను చంపి.. క‌రెంటు స్థంభానికి వేలాడ‌దీసిన భ‌ర్త‌..

అమీర్, సజ్రా వేసిన ప్లాన్ ప్రకారం, అమీర్ రాత్రి అయాజ్ ఇంటికి చేరుకున్నాడు. బుర్కా వేసుకుని ఆ ఇంటి లోకి వెళ్లాడు. లైట్లు ఆఫ్ చేసి అయాజ్ గొంతు కోశాడు. ఆ తర్వాత మెట్లు ఎక్కి ఇంటి పైకి చేరాడు. అక్కడి నుంచి మద్రాసా టెర్రస్ సహాయంతో బ్లాక్ లేన్‌ లోకి దూకి పారిపోయాడు. గొంతు కోసిన కత్తి, రక్తపు మరకలు ఉన్న వస్త్రాలను అక్కడే ఓ బాక్స్‌లో పెట్టి పారిపోయాడు. వీటిని పోలీసులు రికవరీ చేసుకున్నారు.

Also Read: కోడలిని విద్యుత్ స్తంభానికి కట్టేసి కొట్టిన అత్తామామలు.. బీహార్ లో దారుణం..

పోలీసుల దర్యాప్తులో తన వదినె సజ్రా తనకు అక్రమ సంబంధం ఉన్నదని అమీర్ చెప్పాడు. అమీర్, సజ్రాలను పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు.

Follow Us:
Download App:
  • android
  • ios