రక్షా బంధన్ రోజున మానవత్వాన్ని కించపరిచి, అన్నదమ్ముల బంధానికి అవమానం కలిగించే నేరానికి పాల్పడిన సోదరుడిపై ఒడిశా హైకోర్టు సంచలన తీర్పు వెలువర్చింది. కింది కోర్టులు ఇచ్చిన 20 ఏండ్ల జైలు శిక్షను సమర్థించింది. 

మన దేశంలో మహిళలు, చిన్నారులకు రక్షణ లేకుండా పోయింది. మగాళ్లు మృగాళ్లుగా మారుతున్నారు. కామంతో కళ్లు మూసుకు పోయి ఆడ వారిని, చిన్నారులను చిదిమేస్తున్నారు. కొందరు నీచులతే.. మరీ నీచంగా ప్రవర్తిస్తున్నారు. వావివరుసలు మరచి కామాంధులుగా వ్యవహస్తున్నారు. కామంతో కళ్లు మూసుకు పోయి సొంత ఆడ పిల్లలను చిదిమేస్తున్నారు. ఒరిస్సాలో ఇలాంటి ఘటననే వెలుగులోకి వచ్చింది. సొంత అన్నే తన 14 ఏళ్ల చెల్లిపై పదేపదే అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆ చిన్నారి గర్భం దాల్చడం వల్ల విషయం వెలుగులోకి వచ్చింది. అయితే.. ఈ దారుణంపై ట్రయల్ కోర్టు కీలక తీర్పు నిచ్చింది. నిందితుడికి 20 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. 

కాగా..ఆ నిందితుడు ఈ తీర్పును సవాల్ చేస్తూ.. ఒరిస్సా హైకోర్టు ఆశ్రయించారు. నిందితుడి పిటిషన్ ను విచారించిన ఒరిస్సా హైకోర్టు.. ట్రయల్ కోర్టు ఆదేశాలను సమర్థిస్తూ.. సోదరికీ రక్షణగా ఉండాల్సింది పోయి.. కామంతో కళ్లు మూసుకు పోయి 14 ఏళ్ల చిన్నారిని గర్భవతిని చేసిన సోదరుడికి 20 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అదే సమయంలో దోషి అప్పీల్‌ను తిరస్కరించిన జస్టిస్ ఎస్‌కె సాహూ అతనిపై ₹ 40,000 జరిమానా కూడా విధించారు. ఈ జరిమానాను చెల్లించడంలో విఫలమైతే.. దోషికి మరో రెండేళ్ల పాటు కఠిన కారాగార శిక్ష విధించాలని,

రక్షా బంధన్ రోజున ఇలాంటి కేసులో తీర్పు చెప్పాల్సి వచ్చిందని న్యాయమూర్తి వాపోయారు. సోదరుడు తన సోదరిని రక్షించడమే కాకుండా తన చివరి శ్వాస వరకు అండగా ఉంటానని ప్రతిజ్ఞ తీసుకునే శుభవేళ.. ఈ కేసును విచారించి తీర్పు ఇవ్వడం దిగ్భ్రాంతికరమని జస్టిస్ సాహూ వ్యాఖ్యానించారు. మే 2018 నుంచి మే 2019 మధ్య కాలంలో తన చెల్లెలుపై పదేపదే అత్యాచారం చేసినందుకు వ్యక్తిని గతంలో మల్కన్‌గిరి ప్రత్యేక న్యాయమూర్తి కోర్టు దోషిగా నిర్ధారించింది. తన సోదరిని ఇతరులకు చెప్పవద్దని బెదిరించినందుకు జనవరి 2020లో కూడా అతను దోషిగా నిర్ధారించబడ్డాడు.