G20 2023 summit:న్యూఢిల్లీకి చేరుకున్న బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, ఘన స్వాగతం
జీ 20 సమ్మిట్ లో పాల్గొనేందుకు న్యూఢిల్లీకి చేరుకున్న బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కు ప్రభుత్వం ఘనంగా స్వాగతం పలికింది.

న్యూఢిల్లీ: జీ20 సమ్మిట్ లో పాల్గొనేందుకు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ శుక్రవారంనాడు మధ్యాహ్నం న్యూఢిల్లీకి చేరుకున్నారు.బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కు భారత ప్రభుత్వం ఘనంగా స్వాగతం పలికింది. ఈ నెల 9, 10 తేదీల్లో న్యూఢిల్లీలో జీ 20 సదస్సు జరగనుంది. ఈ సదస్సులో ప్రపంచంలోని పలు దేశాధినేతలు హాజరు కానున్నారు. ఈ సమావేశంలో 40 మంది ప్రపంచ చేశాలకు చెందిన ప్రతినిధులు, ఆయా దేశాల అధినేతలు పాల్గొనే అవకాశం ఉంది. ఈ సమావేశానికి కేంద్ర ప్రభుత్వం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తుంది.
జీ 20 సమ్మిట్ నేపథ్యంలో న్యూఢిల్లీలోని పలు ప్రభుత్వ,ప్రైవేట్ కార్యాలయాలకు ఈ నెల 8 నుండి 10వ తేదీ వరకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ మీడియాతో విమానంలో మాట్లాడారు. తనకు ఇష్టమైన ఇండియాకు రావడం సంతోషాన్ని కల్గిస్తుందన్నారు. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ వెంట ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కూతురు అక్షత మూర్తి కూడ ఉన్నారు.బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ భారత ప్రధాని మోడీతో ధ్వైపాక్షిక అంశాలపై చర్చించనున్నారు. ప్రపంచ ఆర్ధిక వ్యవస్థను స్థిరికరించడం, అంతర్జాతీయ సంబంధాలను నిర్మించడం వంటి అంశాలపై కేంద్రీకరించనున్నట్టుగా సునాక్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
జీ 20 సమావేశాలకు తాను స్పష్టమైన థృక్ఫథంతో వెళ్తున్నట్టుగా రిషి సునాక్ తేల్చి చెప్పారు.తనను భారతదేశపు అల్లుడు అంటూ ఎక్కడో చూశాను... ఇది చాలా ఆప్యాయంగా అనిపించిందని మీడియా ప్రతినిధులతో విమనాంలో రిషి సునాక్ వ్యాఖ్యానించారు.
also read:G20 India 2023: జీ20 సదస్సుకు హాజరయ్యే ప్రపంచ దేశాధినేతలు వీరే.. రానివారు ఎవరంటే..?
భారత్-యుకే మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరిగే అవకాశం ఉంది.యూకే ఇమ్మిగ్రేషన్ పాలసీలో ఎలాంటి మార్పులు ఉండవని బ్రిటన్ తేల్చి చెప్పింది. ఈ ఏడాది మేలో జపాన్ లోని హీరోషిమాలో జరిగిన జీ7 సదస్సులో మోడీ, సునాక్ లు కలిశారు.