బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కు రావణుడి కంటే ఎక్కువ అహం - రెజ్లర్ వినేశ్ ఫోగట్
భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ అహం రావణుడి కంటే పెద్దదని భారత అగ్రశ్రేణి రెజ్లర్లు ఆరోపించారు. తాము రాజకీయాలు చేయడం లేదని అన్నారు. తామెప్పుడూ హృదయం నుంచే మాట్లాడుతున్నామని, అది అందరికీ కనెక్ట్ అవుతోందని చెప్పారు.
తమకు న్యాయం చేయాలని కోరుతూ భారత అగ్రశ్రేణి రెజర్లు చేపట్టిన నిరసన దీక్ష కొనసాగుతోంది. వీరు ఢిల్లీలో చేపడుతున్న నిరసనకు అనేక రాజకీయ పార్టీలు, సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి. జంతర్ మంతర్ వద్దకు వచ్చి సంఘీభావం ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం కూడా పలువురు నాయకులు వచ్చి మద్దతు తెలిపారు.
కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి అస్వస్థతకు కారణమేమిటో తేల్చేసిన డాక్టర్లు..
ఈ సందర్భంగా డబుల్ వరల్డ్ ఛాంపియన్ షిప్ పతక విజేత వినేశ్ ఫోగట్ మీడియాతో మాట్లాడారు. తాము రాజకీయాలు చేస్తున్నామని డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు చేసిన ఆరోపణ నిరాధారమని అన్నారు. ‘‘మేం ఎలాంటి రాజకీయాలకు పాల్పడలేదు. మేము హృదయం నుంచి నేరుగా మాట్లాడుతున్నాం. అది కనెక్ట్ అవుతోంది. అందుకే చాలా మంది మాకు మద్దుతుగా కూర్చుంటున్నారు’’ అని అన్నారు. మహిళా అథ్లెట్లను దోపిడీ చేస్తున్నప్పటికీ సింగ్ ను సత్కరిస్తున్నారని, కోర్టులు ఆయనను క్లీన్ చీట్ ఇచ్చేంత వరకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వొద్దని ఆమె మీడియాను కోరారు. ‘‘అలాంటి క్రిమినల్ కు ప్లాట్ ఫామ్ ఎలా ఇస్తారు. అతడు ఇప్పుడు కూడా ముఖం మీద చిరునవ్వుతోనే మాటలు చెబుతున్నాడు. కానీ అతడి అహం రావణుడి కంటే పెద్దది’’ అని ఆమె తెలిపారు.
రెజ్లర్లు డబ్ల్యూఎఫ్ఐని స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నారని, ఈ నిరసన వెనుక ఫోగట్ కుటుంబం ఉందని సింగ్ చేసిన ఆరోపణలను రెజ్లర్ బజరంగ్ పూనియా తిప్పికొట్టారు. అతడి కుమారుడే యూపీ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నాడని, కుమారుడి బావమరిది కార్యదర్శిగా ఉన్నాడని ఆయన ఆరోపించారు. ఆయన అల్లుడు కూడా ఓ రాష్ట్ర సంఘంలో సభ్యుడని తెలిపారు. కానీ తిరిగి ఆయనే తమని 'పరివార్వాద్' అని నిందిస్తున్నారని అన్నారు.
మోడీ జీ.. నా అన్నరాహుల్ గాంధీని చూసి నేర్చుకోండి - కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ
ఒలింపిక్స్ విజేతలను చిన్న చూపు చూస్తూ ప్రశ్నించిన బ్రిజ్ భూషణ్ పై పునియా మండిపడ్డారు. ‘‘ఈ దేశంలో ఎంత మంది ఎంపీలు అవుతారు ? ఎంత మంది ఒలింపిక్ పతకాలు సాధిస్తారు? ఇప్పటి వరకు 40 మంది మాత్రమే ఒలింపిక్ పతక విజేతలు ఉన్నారు. కానీ వేలాది మంది ఎంపీలు అయ్యారు.’’ అని ఆయన అన్నారు.
కాలేజీ ఫీజు కోసం స్నేహితుల సాయం కోరిన యువతి.. హోటల్ లో బంధించి మూడు రోజులు అత్యాచారం
జనవరిలో బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన రెజ్లర్లు.. ఏప్రిల్ 23 నుంచి తిరిగి తమ ధర్నాను ప్రారంభించారు. తమ ఆరోపణలపై దర్యాప్తు చేసిన కేంద్రం నియమించిన కమిటీ నివేదికను బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే తమ నిరసన స్థలంలో రాత్రిపూట విద్యుత్, నీటి సరఫరాను అధికారులు నిలిపివేస్తున్నట్లు రెజర్లు ఆరోపిస్తున్నారు. ఈ రెజర్ల నిరసనతో డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడిగా 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ సింగ్ పై పోక్సో చట్టం కింద ఢిల్లీ పోలీసులు శుక్రవారం రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు.