Bridge Collapse: కుప్పకూలిన వంతెన..నదిలో పడిన వాహనాలు.. ప్రయాణీకుల గల్లంతు..
Bridge Collapse: గుజరాత్‌లోని సురేంద్రనగర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. వస్తాడి ప్రాంతంలోని ఓ పాత వంతెన కూలిపోవడంతో డంపర్,మోటార్‌సైకిళ్లతో సహా పలు వాహనాలు నదిలోకి పడిపోయాయి.

Bridge Collapse:గుజరాత్‌లోని సురేంద్రనగర్ జిల్లాలో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. జిల్లాలోని వస్తాడి గ్రామంలో ఓ పురాతన వంతెన (Bridge) ఆదివారంనాడు అకస్మాత్తుగా కుప్పకూలింది. వంతెన కూలిపోవడంతో దాని మీదుగా వెళ్తున్న ట్రక్కుతో పాటు రెండు బైక్‌లు నదిలో పడిపోయాయి. నదిలో గల్లంతైన నలుగురు వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు. మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి.
సురేంద్రనగర్ జిల్లా వస్తాడి గ్రామం గుండా వెళుతున్న ఈ వంతెన జాతీయ రహదారిని చురా తాలూకాకు కలుపుతుంది. నది ఉధృతంగా ప్రవహించడంతో వంతెన కూలిపోయింది. ప్రమాద సమాచారం అందిన వెంటనే వస్తాది గ్రామ ప్రజలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. నాటు పడవల సాయంతో వాహనాల్లో చిక్కుకున్న వారిని రక్షించారు.
సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వంతెన కూలిపోవడంతో చాలా గ్రామాలకు సురేంద్రనగర్‌తో సంబంధాలు తెగిపోయాయి. ప్రాథమిక నివేదికల ప్రకారం.. ఈ ఘటనలో కనీసం 10 మంది గల్లంతయ్యారు. నలుగురిని రక్షించారు. మిగిలిన ఆరుగురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పోలీసులు, ప్రభుత్వ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు మరియు క్షతగాత్రులను రక్షించిన వ్యక్తులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.
జిల్లా కలెక్టర్ కె.సి.సంపత్ తెలిపిన వివరాల ప్రకారం.. జాతీయ రహదారిని చుర తహసీల్‌కు కలుపుతూ భోగావో నదిపై నిర్మించిన వంతెన 40 ఏళ్ల నాటి నిర్మాణం. వంతెనపైకి భారీ వాహనాల రాకపోకలను అధికారులు ఆంక్షలు విధించారు. వంతెనపై నుంచి డంపర్ వెళ్లేందుకు ప్రయత్నించడంతో వంతెన కూలిపోయినట్లు తెలుస్తోంది. ఈ వంతెనను ఇప్పటికే రోడ్లు భవనాల శాఖకు అప్పగించామని, కొత్త నిర్మాణానికి అనుమతి కూడా ఇచ్చామని కలెక్టర్ తెలిపారు.