Asianet News TeluguAsianet News Telugu

అత్తింటివారికి వార్నింగ్? పెళ్లి అలంకరణలో జిమ్‌లో వధువు ఫొటోషూట్ వైరల్.. నెటిజన్ల కామెంట్లు

పెళ్లికి ముస్తాబై ఆ నవవధువు జిమ్‌కు వెళ్లింది. అక్కడ రకరకాల ఎక్సర్‌సైజ్‌లు చేస్తూ ఫొటోలకు పోజులు ఇచ్చింది. ఆ నవవధువు వీడియో  ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. అది ప్రీ వెడ్డింగ్ షూట్ అని కొందరు చెబుతున్నారు. కాగా, ఆ వీడియోపై నెటిజన్లు కుప్పలు తెప్పలుగా కామెంట్లు చేస్తున్నారు. కొందరు అదంతా కేవలం సోషల్ మీడియాలో హైలైట్ కావాలనే అని నిందితస్తుండగా, ఇంకొందరు ఫ్యూచర్ ప్లాన్ అని వ్యంగ్యోక్తులు విసిరారు.
 

bride went to gym in wedding attire in a video
Author
New Delhi, First Published Nov 29, 2021, 7:54 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

న్యూఢిల్లీ: దేశంలోని చాలా ప్రాంతాల్లో కరోనా ఆంక్షలు దాదాపుగా తొలగిపోవడం, పెళ్లిళ్ల(Wedding) సీజన్ ప్రారంభం కావడంతో సోషల్ మీడియాలో వివాహ వేడుకలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నిండిపోతున్నాయి. పెళ్లికి సంబంధించిన స్టోరీలూ వైరల్ (Viral Video)అవుతున్నాయి. నవంబర్ నుంచి జనవరి వరకు పెళ్లి ముహూర్తాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి, Social Mediaలోనూ దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్నది. నెటిజన్లూ అలాంటి వీడియోలు, ఫొటోలను విరివిగా చూసేస్తున్నారు. వైరల్ చేస్తున్నారు. గత వారమే ఓ వధువు పెళ్లి అలంకరణతో యూనివర్సిటీలో పరీక్ష రాయడానికి వెళ్లారు. వధువు పెళ్లి అలంకరణలో పరీక్ష రాస్తున్న ఫొటో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే.

రాజ్‌కోట్‌కు చెందిన శివాంగి బాగ్థరియా ఎరుపు రంగు చీరలో పెళ్లి మంటపం నుంచి బయల్దేరి వచ్చినట్టు కనిపిస్తూ పరీక్షా కేంద్రంలో కూర్చుని ఎగ్జామ్ రాశారు. ఈ క్లిప్ నెటిజన్ల మనసు దోచేసింది. లక్షల్లో చూసేశారు. కామెంట్లూ విరివిగా వచ్చాయి. దీనితోపాటు మరో క్లిప్ కూడా సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు ముద్దు పెట్టుకోవాలని వరుడి తండ్రి విజ్ఞప్తి చేస్తున్న వీడియో కూడా హాట్ టాపిక్ అయింది. వరుడి తండ్రి విజ్ఞప్తితో పురోహితుడు నూతన వరుడు, వధువులకు అదే సూచన చేశారు. 

Also Read: మరిది పెళ్లిలో.. డ్యాన్స్ తో అదరగొట్టిన వదిన.. వీడియో వైరల్..!

వీటికి తోడు తాజాగా, మరో వీడియో నెట్టింట దుమారం రేపుతున్నది. పెళ్లి అలంకరణలోనే ఓ వధువు ఏకంగా జిమ్‌కు వెళ్లారు. అక్కడ జిమ్‌లో రకరకాల ఎక్సర్‌సైజ్ చేస్తూ ఫొటోలకు పోజులు ఇచ్చారు. ఆమె ఎక్సర్‌సైజులు చేస్తుంటే ఫోటోగ్రాఫర్ ఫొటోలు తీస్తూనే ఉన్నాడు. ఇది ప్రీ వెడ్డింగ్ షూట్ అని కొందరు వాదిస్తున్నారు. ఎందుకంటే ఆ వీడియో క్లిప్‌లో చాలా చోట్ల ఫొటోగ్రాఫర్ కనిపించాడు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by LBB Delhi NCR (@lbbdelhincr)

కాగా, ఈ వీడియో సోషల్ మీడియాపై హాట్ హాట్‌గా కామెంట్లు కురుస్తున్నాయి. కొందరు ఈ వీడియోపై పాజిటివ్‌గా కామెంట్లు చేస్తుంటే మరికొందరు ఆ చర్యను తిరస్కరించారు. మెట్టినింట అడుగు పెట్టకముందే వారిలో గుబులు రేపుతున్నదా? లేక పరోక్షంగా వారికి వార్నింగ్ ఇస్తున్నారా? అంటూ ఒకరు కామెంట్ చేశారు. తనను వేధించారో ఇక అంతే? అనే సిగ్నల్స్ పంపుతున్నారని మరొకరు కామెడీ కామెంట్ చేశారు. కాగా, కొందరేమో ఇదంతా కేవలం సోషల్ మీడియాలో వైరల్ కావాలనే తీశారని అపవాదు వేశారు. ఆమె నిజంగానే జిమ్‌కు వెళ్లాలంటే వెళ్లవచ్చునని, కానీ, వెంట కెమెరామెన్‌ను ఎందుకు తీసుకుపోవాల్సి వచ్చిందని ఇంకొకరు పంచ్ వేశారు. ఇంకొందరైతే డిస్‌లైక్ బటన్ లేనందుకు బాధపడుతున్నట్టు కామెంట్ చేశాడు. ఏమైనా పెళ్లికి సంబంధించిన వీడియోలు, క్రతువులు, వరుడు, వధువుల సిగ్గు, డ్యాన్స్‌లు, పోటీలు ఇలా చాలా విషయాలు చూడముచ్చటగా ఉంటాయి. అలాంటివి సోషల్ మీడియాలో సూపర్ హిట్ అవుతుంటాయి.

Follow Us:
Download App:
  • android
  • ios