ఒక వదిన తన మరిది పెళ్లిలో డ్యాన్స్‌చేసి.. మరిదిపట్ల తన ప్రేమను, అభిమానాన్నిచాటుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. 

పెళ్లి ఇంట సందడి ఉండటం చాలా సహజం. బంధువులు, స్నేహితులు.. అందరూ కలిసి ఆ ఇంట్లో సందడి చేస్తూ ఉంటారు. ఇక ఈ రోజుల్లో పెళ్లి అంటే.. సింపుల్ గా ఒక్కరోజు కాకుండా.. మెహందీ అనీ, హల్దీ ఫంక్షన్ అనీ.. సంగీత్ అనీ.. ఇలా ఒక్కో రోజు ఒక్కోలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సంగీత్ ఫంక్షన్ లో.. అటు.. వధువు తరపువారు.. ఇటు వరుడు తరుపువారు.. ఇద్దరూ ఆనందంగా డ్యాన్స్ లు వేస్తూ ఉంటారు. ఇలాంటి పెళ్లి కి సంబంధించిన ఢ్యాన్స్ వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

Also Read: పనిచేస్తూ కడుపునొప్పితో కిందపడ్డ 14యేళ్ల చిన్నారి... ఆస్పత్రికి తీసుకువెడితే వెలుగులోకి షాకింగ్ విషయం..

ఒక వదిన తన మరిది పెళ్లిలో డ్యాన్స్‌చేసి.. మరిదిపట్ల తన ప్రేమను, అభిమానాన్నిచాటుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. 

Also read: దీపావళి బాణసంచా ఎఫెక్ట్: ఢిల్లీలో ప్రమాదకరస్థాయికి చేరిన వాయు కాలుష్యం

సల్మాన్‌ఖాన్, మాధూరి దీక్షిత్‌ జంటగా నటించిన ‘హమ్‌ ఆప్‌కే హైకోన్‌’ సినిమాలోని ‘లోచలీ మై అప్‌నీ దేవర్‌కి బరాత్‌ లేకే’ అనే పాటను పెళ్లిలో.. ప్లే చేశారు.  ఆ సినిమాలో సల్మాన్‌ఖాన్‌ కోసం అతని.. వదిన ఈ పాటపై సరదాగా స్టెప్పులేస్తుంది. అయితే, ఈ పెళ్లిలో కూడా ఒక మహిళ.. తన మరిది కోసం..  సరదాగా డ్యాన్స్‌ చేసింది. ఈ డ్యాన్స్‌లో ఆ మహిళ.. పాటకు తగ్గట్లుగా చక్కగా స్టెప్పులేసింది. తన వదిన చేస్తున్న డ్యాన్స్‌ చూసి.. కొత్త జంట ఆనందంతో చూస్తూ ఉండిపోయారు.

YouTube video player

 

అదే విధంగా..  వివాహనికి వచ్చిన అతిథులు కూడా.. మహిళ డ్యాన్స్‌ చూసి చప్పట్లతో ఉత్సాహపరిచారు. తమ మొబైల్‌లో మహిళ డ్యాన్స్‌ను రికార్డు చేశారు. ఈ పెళ్లి ఎక్కడ జరిగిందో వివరాలు లేవు. ప్రస్తుతం ఈ వీడియో మాత్రం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు ‘వావ్‌.. ఎంత బాగా డ్యాన్స్‌ చేస్తున్నారు..’, ‘ఆ మహిళ జోష్‌ చూస్తే.. మాకు ఒక స్టెప్‌ వేయాలనుంది..’  అంటూ కామెంట్‌లు చేస్తున్నారు.