పెళ్లి తంతు జరుగుతూ ఉండగానే.. పక్కనే వరుడు ఉన్నప్పటికీ ఆ వధువు కునికిపాట్లు పడింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఈ వీడియోను స్వయంగా ఆ వధువే సోషల్ మీడియాలో పోస్టు చేశారు. 

న్యూఢిల్లీ: పెళ్లి కోసం జంటలు ఎన్నో ప్లాన్లు వేసుకుంటారు. జీవితాంతం మరిచిపోని విధంగా వివాహాన్ని డిజైన్ చేసుకుంటారు. ఎంత గ్రాండ్‌గా చేసుకున్నా.. నిరాడంబరంగానైనా పెళ్లి తంతు మాత్రం పెద్దగే ఉంటుంది. ముఖ్యంగా హిందు సంప్రదాయ పెళ్లిళ్ల గురించి చెప్పనక్కరలేదు. వరుడి కంటే వధువు మెకప్ వంటి కొన్ని విషయాలు వారికి రెస్ట్ తీసుకునే సమయమే ఇవ్వవు. అందుకే పెళ్లిలో మెరిసిపోవాలని కొన్ని రోజుల ముందు నుంచే జంట రకరకాలుగా ప్రయత్నాలు చేస్తారు. కానీ, పెళ్లి తంతు పూర్తయ్యే వరకు వారి ముఖాలు దాదాపు వడలిపోయినట్టుగా మారిపోతాయి. ఈ కోవలోకే తాజా వైరల్ వీడియో వస్తుంది.

హెవీగా మేకప్ అయిన వధువు ఆ వీడియోలో కనిపించింది. ఆమె అన్ని రకాలుగా ముస్తాబు అయి వరుడి పక్కనే కూర్చుంది. వరుడు నిలుచుని ఉన్నాడు. కాగా, పక్కనే కూర్చున్న వధువు మాత్రం చేతులు దగ్గర పెట్టుకుని నిద్రలోకి జారిపోయింది. ఒక వైపు పెళ్లి తంతు జరుగుతూనే ఉన్నది. మరో వైపు వధువు కునికిపాట్లు తీస్తున్నట్టు ఆ వీడియోలో చూడవచ్చు. 

View post on Instagram

ఇది పాత వీడియోనే అయినప్పటికీ తాజాగా వైరల్ అయింది. ఈ వీడియోను స్వయంగా ఆ వధువే సోషల్ మీడియాలో పోస్టు చేసింది. రాత్రంతా గడిచిపోయినా ఆ తంతు ఇంకా పూర్తి కాలేదని ఆమె ఆ వీడియో కింద క్యాప్షన్ రాశారు. ‘ఇదిగో ఇక్కడ నిద్రపోతున్న వధువు ఉన్నది. అప్పటికే ఉదయం 6.30 అవుతున్నది. కానీ, పెళ్లి మాత్రం ఇంకా జరుగుతూనే ఉన్నది’ అని ఆమె పేర్కొన్నారు.

Also Read: కుక్క అనుకుని నక్కను పెంచుకున్నారు.. ఆరునెలల తరువాత ఊళ పెడుతుండడంతో షాక్ అయ్యి...

ఈ వీడియోను వధువు మిత్రురాలే తీసినట్టు తెలుస్తున్నది. అయితే, తనను రికార్డు చేస్తున్నారనే విషయం తెలిసినప్పటికీ ఆ వధువు కునికిపాట్లు తీయకుండా నిగ్రహించుకోలేకపోయింది.

ఈ వీడియోపై చాలా మంది కామెంట్లు చేశారు. చాలా మంది తమను ఆ వీడియోలో ఉన్న వధువు పరిస్థితితో పోల్చుకున్నారు. కొందరైతే ఆ వధువు మేకప్, డ్రెస్సింగ్‌ను మెచ్చుకున్నారు.