భోపాల్: బ్యూటీపార్లర్‌కు వెళ్లిన ఓ వధువు అక్కడే హత్యకు గురైంది. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది.ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు కారణమని పోలీసులు ప్రాథమిక విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రాట్లాం జిల్లాలోని జోరా పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకొంది. షాజాపూర్ ప్రాంతానికి చెందిన సోనూ యాదవ్‌ అనే యువతికి  మూడేళ్ల క్రితం ఓ ఫంక్షన్‌లో రామ్‌ యాదవ్‌ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. స్నేహంగా మారి ప్రేమకు దారితీసింది. అనంతరం విభేదాల కారణంగా ఇద్దరూ విడిపోయారు.

ఈ నెల 5వ తేదీన సోనూకు వేరే వ్యక్తితో పెళ్లి జరిపించేందుకు కుటుంబసభ్యులు నిర్ణయం తీసుకొన్నారు. ఇందులో భాగంగానే షాజాపూర్ నుండి సోనూను తీసుకొని జోరా పట్టణానికి వచ్చారు. 

పెళ్లి జరగడానికి  కొన్ని గంటల ముందు మేకప్ కోసం వధువు సోనూ తన సోదరితో కలిసి బ్యూటీ పార్లర్ కు వెళ్లింది. సోనూకు పెళ్లి నిశ్చయమైందని రామ్ యాదవ్ కు తెలిసింది. తనకు దక్కని సోనూ ఇతరులకు దక్కకూడదని రాము యాదవ్ భావించారు.

సోనూ కంటే ముందే రాము యాదవ్ జోరా పట్టణానికి వచ్చాడు. సోనూకు రాము యాదవ్ పదే పదే ఫోన్ చేశాడు,. కానీ ఫోన్ లిప్ట్ చేయలేదు.  అంతేకాదు తన స్నేహితుడు పవన్ పంచాల్ నుండి రామ్ ఫోన్ చేశాడు. తాను బ్యూటీ పార్లర్ లో ఉన్నట్టుగా ఆమె చెప్పింది. 

సోనూ ఎక్కడ ఉందో తెలుసుకొన్న రాము యాదవ్ బ్యూటీపార్లర్ కు వెళ్లి ఆమె గొంతు కోశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. ఆమె చనిపోయిందని నిర్ధారించుకొన్న తర్వాత పవన్ తో కలిసి రాము పారిపోయాడు.