ఘనంగా వివాహం.. పాముల్ని మార్చుకుని ఒక్కటైన జంట

bride and groom exchange snake varmala
Highlights

వివాహం జరిగిన తర్వాత దండలు వధూవరులు దండలు మార్చుకోవడం అన్నది సాంప్రదాయం.. అలాంటిది ఈ ఫోటోలో ఉన్న జంట పాములను మార్చుకుని వివాహం చేసుకుంది.

వివాహం జరిగిన తర్వాత దండలు వధూవరులు దండలు మార్చుకోవడం అన్నది సాంప్రదాయం.. అలాంటిది ఈ ఫోటోలో ఉన్న జంట పాములను మార్చుకుని వివాహం చేసుకుంది. విభిన్న సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ఉన్న భారతవనిలో ఒక్కో చోట ఒక్కో ఆచారం. అలాంటిదే ఈ ఫోటోలో కనిపిస్తున్న సంఘటన కూడా..

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో ప్రకారం.. తెల్లని దుస్తులు ధరించిన వధూవరులు.. వేదపండితుల సమక్షంలో తొలుత వరుని మెడలో పెళ్లికూతురు బుసులు కొడుతున్న పామును వేసింది. అనంతరం చిన్న పూజ తర్వాత వరుడు పెళ్ళి కూతురి మెడలో జరజరా పాకుతున్న కొండ చిలువను వేశాడు.. దీంతో అక్కడున్న బంధువులు, సన్నిహితులు చప్పట్లు కొట్టారు.. అయితే  ఈ పెళ్లి ఎక్కడ జరిగిందో మాత్రం వివరాలు తెలియరాలేదు.

loader