ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో బాయ్స్ లాక్ రూమ్ పేరిట కొందరు స్కూల్ స్టూడెంట్స్ అరాచకం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆడపిల్లలను ఎలా రేప్ చేయాలి అంటూ, అమ్మాయిల బాడీ పార్ట్స్ పై నీచమైన కామెంట్స్ చేశారు. కాగా.. వాటికి సంబంధించిన స్క్రీన్ షార్ట్స్ ఆన్ లైన్ వైరల్ అయ్యాయి. దీంతో.. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. అయితే.. దీనికి సంబంధించి ఓ తాజా ట్విస్ట్ ఒకటి ఇప్పుడు బయటపడింది.

ఓ టీనేజీ అమ్మాయే అబ్బాయిగా ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి అబ్బాయిల‌తో చాట్ చేసిన‌ట్లు విచార‌ణ‌లో తేలింది. త‌న శ‌రీరంపై తానే అస‌భ్య‌క‌ర వ్యాఖ్య‌లు చేస్తూ, దానికి అబ్బాయిలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాల‌ని తాను ఈ ప‌ని చేసిన‌ట్లు పేర్కొంద‌ని ఢిల్లీ సైబ‌ర్ పోలీసులు వెల్ల‌డించారు. 

త‌న పేరు సిద్దార్థ్‌గా ప‌రిచ‌యం చేసుకొని త‌న శ‌రీరంపై అస‌భ్య‌క‌ర వ్యాఖ్య‌లు చేసింది. దానికి అబ్బాయి ఎలా రియాక్ట్ అవుతాడో దాన్ని బ‌ట్టి త‌న క్యారెక్ట‌ర్ తెలుసుకోవ‌చ్చ‌ని స‌ద‌రు టీనేజీ అమ్మాయి విచార‌ణ‌లో పేర్కొంది.

కొంత‌మంది టీనేజీ విద్యార్థులు ఇన్‌స్టాగ్రామ్‌లో బాయ్స్ లాక‌ర్ రూం అనే అకౌంట్ క్రియేట్ చేసి త‌మ క్లాస్‌మేట్స్ అమ్మాయిల బాడీ షేమింగ్‌పై అస‌భ్య‌క‌ర వ్యాఖ్య‌లు చేస్తూ చాటింగ్ చేసిన ఘ‌ట‌న తెలిసిందే. వీరంతా ఢిల్లీలోని ప్ర‌ముఖ స్కూల్‌లో చ‌దువుతున్న వారే. 

గ్యాంగ్ రేప్ చేద్దామంటూ స‌ద‌రు విద్యార్థులు చాట్ చేసిన స్క్రీన్ షాట్లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. వీరంతా 18 ఏళ్లు అంత‌కంటే త‌క్కువ వ‌య‌సు ఉన్న‌వారే. 

అమ్మాయిల ఫోటోలు అశ్లీలంగా మార్ఫింగ్ చేసి అస‌భ్య‌క‌రంగా గ్రూప్‌లో చ‌ర్చించుకున్నారు. దీనికి సంబంధించి విచార‌ణ చేపట్టిన పోలీసులు 24 మంది విద్యార్థుల‌ను అదుపులోకి తీసుకున్నారు.