ఫేస్‌బుక్‌ లవ్: ప్రియుడు సూసైడ్, ప్రియురాలు జంప్

boyfriend commits suicide lover disappear in Karnataka state
Highlights

;ప్రియుడు సూసైడ్, ప్రియురాలు జంప్


బెంగుళూరు:ప్రేమలో ఫెయిలైనందుకు గాను  రంజిత్ కుమార్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకొన్నాడు. అయితే ఈ విషయం తెలుసుకొన్న ప్రియురాలు మాత్రం పారిపోయిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఫేస్‌బుక్ లో పరిచయమైన డిగ్రీ విద్యార్ధినితో రంజిత్‌కుమార్ అనే వ్యక్తి  ప్రేమలో పడ్డాడు.  కర్ణాటకలోని గౌరిబిదనూరులోని నెహ్రునగర్‌లో రంజిత్‌కుమార్ నివాసం ఉండేవాడు.  వీరిద్దరి మధ్య కొంతకాలంగా ప్రేమ వ్యవహరం సాగింది. కానీ, ఈ మధ్య ఏమైందో తెలియదు కానీ,  రంజిత్‌కుమార్  ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు.

ఈ మేరకు తన లవ్ ఫెయిల్యూర్ విషయమై సెల్‌ఫోన్‌లో  సెల్పీ రికార్డింగ్ చేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు తాను తీసుకొన్న సెల్పీ వీడియోను ఫేస్‌బుక్ లో పోస్టు చేశఆడు. ఆ తర్వాత ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఈ విషయం తెలిసిన ప్రియురాలు  ఆమె సోదరుడు  పారిపోయారు. రంజిత్ కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  అయితే రంజిత్ కుమార్ ఆత్మహత్య చేసుకోవడానికి ఉన్న కారణాలపై  పోలీసులు ఆరా తీస్తున్నారు. 
 

loader