కర్ణాటకలో ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన వివాహిత హత్య కేసు మిస్టరీ ఓ కొలిక్కి వచ్చింది. ఆమెను ప్రియుడే హత్య చేశారని తేల్చారు. పోలీసుల విచారణలో నిందితుడే ఈ విషయాన్ని అంగీకరించాడు.
వివాహిత హత్య కేసులో మిస్టరీని పోలీసులు చేధించారు. ఆమెను ప్రియుడే హతమార్చాడని నిర్ధారణకు వచ్చారు. తాగిన మత్తులో అతడే ఈ నిజాన్ని వాగేశాడు. దీంతో పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. అతడిని అదుపులోకి తీసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రం దావణగెరె మండలంలోని ఓ గ్రామానికి చెందిన కవితకు, హరపనహళ్లి మండలం నిట్టూరుకు చెందిన ఓ వ్యక్తితో కొన్ని సంవత్సరాల కిందట వివాహం జరిగింది.
యాక్సిడెంట్ లో కుమారుడు మృతి.. ఆత్మను ఇంటికి తీసుకొచ్చేందుకు విచిత్ర పూజలు..
అయితే కొంత కాలం నుంచి ఆమెకు సలీం మున్నాఖాన్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలో కవిత ఈ ఏడాది ఫిబ్రవరి 23వ తేదీన తన ఇంటి నుంచి బయలుదేరింది. తాను హరహర కు వెళ్లి వస్తానని ఇంట్లో నుంచి వెళ్లింది. కానీ ఎంత సేపటికీ ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. పుట్టింటి వారిని సంప్రదించారు. కానీ అక్కడికి వెళ్లలేదని తెలిసింది. దీంతో కుటుంబ సభ్యులు హలవాగలు పోలీసులను ఆశ్రయించారు. కవిత కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశారు.
ఆ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఓ పొలంలో కవిత చనిపోయి కనిపించింది. దీనిపై పోలీసులు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఈ కేసులో పెద్దగా పురోగతి లేదు. కానీ ఇటీవల ఆమె ప్రియుడు తాగి నిజాన్ని కక్కేయడంతో కవిత మృతి కేసు ఓ కొలిక్కి వచ్చింది.
మోడీ భారతీయ సంస్కృతికి ప్రతీక - భారత ప్రధానిపై హాలీవుడ్ నటుడు రిచర్డ్ గేర్ ప్రశంసలు
ఫిబ్రవరి 23వ తేదీన కవిత ఇంటి నుంచి బయలుదేరిన తరువాత తన ప్రియుడి సలీం మున్నాఖాన్ ను కలిసింది. వారిద్దరూ బైక్ పై సలీం సొంత గ్రామమైన తెలగికి చేరుకున్నారు. అనంతరం బైక్ పై కుంచూరి చెరువు వద్దకు చేరుకున్నారు. ఈ సమయంలో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ‘నీకు ఫోన్ చేస్తే బిజీ అని చెబుతోంది. నీకు ఇంకో వ్యక్తితో అక్రమం సంబంధం ఏర్పడింది.’’ అంటూ సలీం ఆమెపై అనుమానం వ్యక్తం చేశాడు.
ఈ క్రమంలో వారి మధ్య గొడవ జరిగింది. అయితే ఓ దశలో సలీం కవిత గొంతు పిసికి, ఊపిరి ఆడనివ్వకుండా హతమార్చాడు. తరువాత పొలంలోనే డెడ్ బాడీకి నిప్పుపెట్టాడు. అయితే ఇటీవల సలీం బాగా తాగి.. ఆ మత్తులో కవితను తానే చంపానని గొప్పగా వాగేశాడు. దీనిని స్థానికులు బాధితురాలి కుటుంబానికి తెలియజేశారు. వారు దీనిని పోలీసులు తెలిపారు. దీంతో పోలీసులు సలీంను అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తులో అతడు తన నేరాన్ని అంగీకరించాడు.
