ఫేమస్ చాకొలేట్ కంపెనీ క్యాడ్బబరీ మాండెలేజ్ ఇండియాపై ట్విట్టర్‌లో వ్యతిరేకత వచ్చింది. దీపావళికి ఈ కంపెనీ విడుదల చేసిన యాడ్ పై అభ్యంతరంతోపాటు ఓ తప్పుడు పిక్ మూలంగా బాయ్‌కాట్ క్యాడ్బరీ హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అయింది.
న్యూఢిల్లీ: ట్విట్టర్ బాయ్‌కాట్ క్యాడ్బరీ ట్రెండ్ అయింది. ఆదివారం ట్విట్టర్‌లో ఈ దృశ్యం కనిపించింది. ఇందుకు ఆ సంస్థ విడుదల చేసిన కొత్త యాడ్ కారణంగా ఉన్నట్టు తెలుస్తున్నది. అయితే, దానికి తోడు ఒక అబద్ధపు వాదన కూడా ట్రెండ్ అయింది.
దీపావళి సందర్భంగా క్యాడ్బరీ ఇండియా ఓ యాడ్ రిలీజ్ చేసింది. ఇందులో దీపావళి రోజున క్యాడ్బరీ చాకొలేట్లను బహుమతిగా ఇస్తే పేద ప్రజల్లో ఎలా వెలుగులు నింపుతాయో వివరిస్తూ ఈ యాడ్ ఉన్నది. తొలుత కస్టమర్లు ఈ అడ్వర్టయిజ్‌మెంట్‌ను పాజిటివ్‌గానే తీసుకున్నారు. కానీ, ఓ నెల తర్వాత దీనిపై వ్యతిరేకత రావడం మొదలైంది.
Also Read: మహిళా సాధికారత: ‘క్యాడ్బరీ’ అడ్వర్టయిజ్‌మెంట్‌పై ప్రశంసల వెల్లువ.. రెండు వీడియోలు వైరల్
ఈ యాడ్‌ను వీహెచ్‌పీ లీడర్ సాధ్వి ప్రాచీ షేర్ చేశారు. ఆ యాడ్‌లో దీపాలు అమ్ముకుంటున్న పేద వృద్ధుడి పేరు దామోదర్‌గా పెట్టారు. ఈ పేరును వినియోగించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ తండ్రి దామోదర్ పేరును చిన్నచూపుగా చూపించారని ఆమె అభ్యంతరం తెలిపారు. చాయివాలా కే బాప్ దియావాలా అని తెలిపేలా ఆ యాడ్ ఉన్నదని ట్వీట్ చేశారు.
ఆ తర్వాత బాయ్‌కాట్ క్యాడ్బరీ అనే ట్యాగ్ ట్విట్టర్‌లో ట్రెండ్ అయింది. ఈ ట్రెండింగ్‌లో కొందరు యూజర్లు ఆస్ట్రేలియా వెబ్‌సైట్ నుంచి తెచ్చి ఆ వివరాలు కనిపించకుండా చేసిన ఓ పిక్‌నూ వైరల్ చేశారు. క్యాడ్బరీలో బీఫ్ వాడుతున్నారని, ఆ బీఫ్ హలాల్‌ది చెబుతున్నట్టుగా క్యాడ్బరీ వెబ్‌సైట్‌లో ఉన్నదని వివరించారు. అంటే.. హిందువుల చేత హిందువులకే బీఫ్ తినిపిస్తున్నారని ఆరోపించారు. హలాల్ సర్టిఫికేషన్ ఇచ్చి జిహాదీలకు అనునాయంగా ఉన్నారని వాదించారు.
నిజానికి ఆ ఇన్ఫర్మేషన్ క్యాడ్బరీ ఇండియా వెబ్‌సైట్‌కు చెందినది కాదు. ఆస్ట్రేలియా వెబ్‌సైట్ సమాచారాన్ని ఇక్కడి సమాచారంగా చిత్రించి దుష్ప్రచారానికి తెరలేపారు. దీంతో అది ట్రెండ్ అయింది. బీఫ్ ఉన్న క్యాడ్బరీ స్వీట్లు తినడం కంటే.. దేశీయ గోవు పాల పదార్థాలతో చేసిన స్వీట్లు తినడం మంచిదని, అది దేశీయ వ్యాపారులనూ పరిపుష్టం చేస్తుందంటూ వోకల్ ఫర్ లోకల్ అంటూ కొందరు యూజర్లు ట్వీట్లు చేశారు. కానీ, ఈ వాదన పూర్తిగా అవాస్తవం.
2021లోనూ క్యాడ్బరీ కంపెనీ ఈ బాయ్‌కాట్ సవాల్‌ను ఎదుర్కొంది. అప్పుడే ఇండియాలో అమ్మే తమ ఉత్పత్తులపై వివరణ ఇచ్చింది. భారత్‌లో అమ్మే స్వీట్లు పూర్తిగా శాకాహారమేనని (వెజిటేరియన్)వే అని స్పష్టం చేసింది. అందుకే ఆ స్వీట్ల రాపర్ పై గ్రీన్ డాట్ ఉంటుంది.
