Asianet News TeluguAsianet News Telugu

మహిళా సాధికారత: ‘క్యాడ్బరీ’ అడ్వర్టయిజ్‌మెంట్‌‌పై ప్రశంసల వెల్లువ.. రెండు వీడియోలు వైరల్

క్యాడ్బరీ డైరీ మిల్క్ పాత యాడ్‌కే కొత్త ట్విస్ట్ ఇస్తూ విడుదల చేసిన అడ్వర్టయిజ్‌మెంట్ వీడియో నెటిజన్ల మనసు గెలుచుకుంది. కొందరు పాత యాడ్‌ స్మృతులు గుర్తుచేసుకుంటే ఇంకొందరు కొత్త యాడ్‌లో అద్భుతమైన ట్విస్ట్‌కు ఫిదా అవుతున్నారు. మహిళా సాధికారతను ప్రతిబింబించే ఈ యాడ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.

cadbury new ad with wonderful twist wins internet
Author
New Delhi, First Published Sep 17, 2021, 8:24 PM IST

న్యూఢిల్లీ: క్యాడ్బరీ డైరీ మిల్క్ యాడ్‌లు ఎప్పుడూ ఆకట్టుకుంటూనే ఉంటాయి. మంచి జింగిల్స్‌తో కనులకు ఇంపు అయిన సీన్లతో అబ్బురపరుస్తుంటాయి. తాజాగా ఈ సంస్థ 1990లలో వచ్చిన ఓ యాడ్‌ను పునసృష్టించారు. కానీ, ఇందులో అద్భుతమైన ట్విస్ట్ పెట్టారు. ఇప్పుడు నెటిజన్లను అదే యాడ్ కట్టిపడేస్తున్నది. యాడ్‌పై అన్నివర్గాల నుంచి ప్రశంసల జల్లు కురుస్తున్నది.

మహిళలు అపూర్వ విజయగాథలతో చరిత్ర లిఖిస్తున్నారని, యువతకు రోల్ మాడల్స్‌గా మారుతున్నారని, అలాంటి మహిళలందరి విజయాలను క్యాడబ్రీ డైరీ మిల్క్‌ ద్వారా అభినందిస్తూ వేడుక చేసుకోవాలి అంటూ తాజా యాడ్‌కు క్యాప్షన్ పెట్టింది.

1990లో వచ్చిన యాడ్‌కు తాజా యాడ్‌కు ఉన్న తేడా ఏంటంటే.. ప్లాట్ ఒక్కటే.. కానీ, క్యారెక్టర్‌ల జెండర్‌ను స్వాప్ చేశారు. అంటే, అప్పటి యాడ్‌లో మగవారిగా కనిపించే క్యారెక్టర్లు తాజా యాడ్‌లో మహిళా క్యారెక్టర్లుగా కనిపిస్తాయి. తద్వార అంతర్లీనంగా మహిళా సాధికారతను, అన్ని రంగాల్లో మహిళల పురోగతిని చాటిచెప్పినట్టయింది. ఈ విషయంపైనే నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

1990లో క్యాడ్బరీ యాడ్ ఇలా ఉంటుంది. గ్రౌండ్‌లో బ్యాట్ పట్టుకుని బెరుకుగా చూస్తున్న బ్యాట్‌మెన్‌ ప్రేక్షకుల్లో క్యాడ్బరీ తింటున్న తన ప్రేయసిని చూస్తాడు. బాల్ వేయగానే సిక్స్ బాదుతాడు. వెంటనే ప్రేయసి సెక్యూరిటీ గార్డ్‌ను తప్పించుకుని మరీ హుషారుగా డ్యాన్స్ చేస్తూ బ్యాట్‌మెన్ దగ్గరకు వెళ్లి హద్దుకుంటుంది.

తాజా యాడ్‌లోనూ అదే స్టోరీ. కానీ, ఈ యాడ్‌లో ఫీల్డ్‌లో బ్యాట్ వుమన్ ఉంటుంది. ప్రేక్షకుల్లో ఆమె ఫ్రెండ్ క్యాడ్బరీ తింటూ చూస్తుంటాడు. ఆమె సిక్స్ కొట్టగానే అదే తీరున గ్రౌండ్‌లోకి డ్యాన్స్ చేస్తూ ఆమె చెంతనచేరుతాడు.

Follow Us:
Download App:
  • android
  • ios