తల్లి ఫోన్ లాక్కుందన్న అక్కసుతో నిండు ప్రాణాన్ని తీసుకున్నాడో బాలుడు. ఎప్పుడు చూసినా ఫోన్ లో ఆన్ లైన్ గేమ్స్ ఆడుతున్నాడని కోప్పడినందుకు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
ముంబై : onlineలో games ఆడుతుండగా తల్లి ఫోన్ లాక్కుందన్న కోపంతో 16 ఏళ్ల బాలుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన Maharashtraలోని ముంబైలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బుధవారం సాయంత్రం బాలుడు ఆన్లైన్ గేమ్స్ ఆడుతుండగా తల్లి phone తీసుకుంది. చదువుకోవాలని చెప్పింది. దీంతో కోపానికి గురైన బాలుడు Suicide note రాసి పెట్టి ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయాడు.
అయితే, ఇంటికి తిరిగి వచ్చిన తల్లి ఆ లేఖను గుర్తించి చదవగా అందులో తాను ఆత్మహత్య చేసుకునేందుకు ఇంటి నుంచి వెళ్లిపోతున్నానని ఇక ఎప్పటికీ తిరిగి రాను అంటూ పేర్కొన్నాడు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వగా రంగంలోకి దిగి పోలీసులు బాలుడి ఆచూకీ కోసం గాలించారు. ఆ తర్వాత మలాద్--కందివాలి రైల్వే స్టేషన్ల మధ్య ఎవరో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం అందడంతో.. అక్కడకు వెళ్లిన పోలీసులు విచారణ జరిపారు. సూసైడ్ చేసుకున్న ది ఇంటి నుంచి వెళ్లిపోయిన బాలుడే అని నిర్ధారించారు. దీంతో రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఎక్కువ సేపు టీవీ చూస్తున్నావన్నందుకు...
జూన్ 4న తమిళనాడులో ఇలాగే ఓ చిన్నారి ఆత్మహత్య చేసుకుంది. స్థానిక మాధవరంలో ఎక్కువసేపు TV చూస్తూందని తల్లి మందలించడంతో ఏడో తరగతి బాలిక suicideకు పాల్పడింది. మాధవరం తెలుగు కాలనీకి చెందిన నాగరాజు చెన్నై కార్పొరేషన్ మాధవరం మండలంలో Sanitation workerగా పనిచేస్తున్నాడు. ఆయన కుమార్తె ఏంజెల్ (12) మాధవరం ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదువుతుంది. ఏంజల్ ఇంట్లో ఎక్కువ సమయం టీవీ చూస్తూ ఉండటంతో, తల్లి కుమార్తెను మందలించింది. దీంతో మనస్తాపం చెందిన ఏంజెల్ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మాధవరం పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
బొమ్మకు ఉరివేసి.. తానూ వేసుకుని..
ఇదిలా ఉండగా, maharasthra లోని పుణెలో దిగ్బ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. ఆడుకునే బొమ్మకు ఉరివేసిన ఎనిమిదేళ్ల బాలుడు ఆ తరువాత తాను కూడా ప్రాణం తీసుకున్నాడు. వస్త్రాన్ని ముఖంమీద కప్పుకుని ఊపిరాడకుండా చేసుకుని చనిపోయాడు. పింప్రీ చించ్వడ్ లోని తేర్ గావ్ లో రెండు రోజుల క్రితం ఈ ఘటన జరిగింది. బొమ్మతో ఆడుకుంటున్న సమయంలో ఎనిమిదేళ్ల బాలుడు దానికి ఉరివేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ తరువాత అది చనిపోయిందనుకుని.. తాను కూడా ముఖం మీద బట్ట కప్పుకుని ఊపిరాడకుండా చేసుకుని చనిపోయాడు. ఈ ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు కంగు తిన్నారు. ఫోన్ లో ఓ హారర్ వీడియోను అనుకరించడం వల్లే బాలుడు ఇలా చేశాడని తెలిపారు. బాలుడి తల్లి వేరే పనిలో ఉండగా ఈ ఘటన జరిగిందని అంటున్నారు.
పవన్ కల్యాణ్ సినిమాకు డబ్బులివ్వలేదని..
ఫిబ్రవరి 15న తెలంగాణలోని.. jagtial జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సినిమా టికెట్ కు డబ్బులు ఇవ్వలేదని ఓ స్కూల్ విద్యార్థి suicide చేసుకున్నాడు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. నవదీప్ (11) అనే బాలుడు 8వ తరగతి చదువుతున్నాడు. Bhimla Nayak సినిమా కోసం తన మిత్రులు ముందుగానే tickets Bookచేసుకుంటున్నారని తనకి కూడా రూ.300 కావాలని తండ్రిని నవదీప్ అడిగాడు. అందుకు తండ్రి నిరాకరించాడు. దీంతో మనస్తాపం చెందిన నవదీప్ ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. విద్యార్థి మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటన మీద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
