మైనర్ల మధ్య ఏకాభిప్రాయ శృంగారం గురించి చట్టంలో అస్పష్టంగా ఉందంటూ బాంబే హైకోర్టు కీలకవ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు గతంలో ఇలాంటి కేసులో 19 ఏళ్ల యువకుడికి విధించిన పదేళ్ల కఠిన కారాగార శిక్షను నిలిపేస్తూ తీర్పునిచ్చింది. నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది.

మైనర్ల మధ్య ఏకాభిప్రాయ శృంగారం గురించి చట్టంలో అస్పష్టంగా ఉందంటూ బాంబే హైకోర్టు కీలకవ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు గతంలో ఇలాంటి కేసులో 19 ఏళ్ల యువకుడికి విధించిన పదేళ్ల కఠిన కారాగార శిక్షను నిలిపేస్తూ తీర్పునిచ్చింది. నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది.

వివరాల్లోకి వెడితే... తనింట్లో ఉన్న మైనర్ బాలికమీద అత్యాచారం చేశాడనే ఆరోపణల మీద మూడేళ్ల కిందట ఓ మైనర్ కు కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. బాధితురాలైన మైనర్‌ బాలిక చదువుకోవడం కోసం నిందితుడి ఇంట్లో ఉండేది. 

ఈ క్రమంలో 2017 సెప్టెంబర్‌లో బాధితురాలు తన కజిన్ తనను అసభ్యకరంగా టచ్ చేశాడంటూ.. అప్పట్నుండి కడుపులో నొప్పి వస్తుందని ఫ్రెండ్ తో చెప్పింది. ఈ విషయాన్ని ఆ స్నేహితురాలు క్లాస్‌ టీచర్‌ దృష్టికి తీసుకెళ్లింది. టీచర్ బాధిత బాలికను విషయం ఏంటని ఆరా తీసింది. కజిన్‌ తనమీద అత్యాచారం చేశాడని చెప్పడంతో, టీచర్‌ ఈ విషయాన్ని ప్రిన్సిపాల్‌ దృష్టికి తీసుకెళ్లింది.

దీంతో 2018 మార్చి 3న ఆ యువకుడిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. వైద్యపరీక్షల్లో బాలికకు ఎలాంటి బాహ్య గాయాలు లేవని తేలింది. ఆ తర్వాత నిందితుడికి దిగువ కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో అతడు హై కోర్టును ఆశ్రయించాడు. బెయిల్ కు దరఖాస్తు చేసుకున్నాడు. 

ఈ కేసు విచారణలో భాగంగా కోర్టు మైనర్ బాలిక స్టేట్‌మెంట్‌ని రికార్డు చేసింది. ఈ నేపథ్యంలో బాలిక చెప్పిన విషయాలు షాక్ కు గురి చేశాయి. తామిద్దరి ఏకాభిప్రాయంతోనే లైంగిక చర్య జరిగిందని చెప్పి విస్మయపరిచింది. అంతేకాదు ఇలా నాలుగైదు సార్లు తమ మధ్య జరిగిందని తెలిపింది. అత్యాచారం జరిగిందని ఎందుకు చెప్పావన్న ప్రశ్నకు టీచర్‌ బలవంతం మీదనే తాను అలా చెప్పానని పేర్కొంది. 

సాక్ష్యాలను పరిశీలించిన జస్టిస్ షిండే.. మైనర్ల మధ్య ఏకాభిప్రాయ శృంగారం గురించి చట్టంలో అస్పష్టంగా ఉందన్నారు. మైనర్ల అనుమతిని పరిగణలోకి తీసుకోలేం.. ఇక ఈ కేసులో బైటపడ్డ వాస్తవాలు విలక్షణంగా ఉన్నాయి. బాధితురాలు, నిందితుడు ఇద్దరూ ఒకే కప్పు కింద ఉంటున్నారు. వీరిద్దరూ స్టూడెంట్లే.. అంతేకాదు బాధితురాలు తన స్టేట్మెంట్ ను వెనక్కి తీసకుంది అని అన్నారు.

కోర్టు ఈ ముఖ్యమైన విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకుంటుంది. వీటిని పరిశీలించిన తరువాత ఈ కేసులో నిందితుడికి బెయిల్‌ మంజూరు చేస్తున్నాం. అయితే దీన్ని బాధితుడు దుర్వినియోగం చేయకూడదని కోర్టు సూచించింది. అతనికి విధించిన శిక్ష నిలిపేస్తే కోర్టు తీర్పు వెల్లడించింది.