బెంగళూరులోని 4 స్కూళ్లలో బాంబులు అమర్చామని  హెచ్చరిస్తూ మెయిల్స్ రావడం కలకలం రేపింది. ఒకే రకమైన కంటెంట్ తో ఉన్న మెయిల్స్ నగర శివారులోని 4 స్కూల్స్ వచ్చాయి. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని సోదాలు నిర్వహిస్తున్నారు. 

బెంగుళూరులోని నాలుగు పాఠశాలలకు ఈ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వ‌చ్చాయి. దీంతో పోలీసులు అలెర్ట్ అయ్యాయి. పోలీసు బృందాలు అక్కడికి వెళ్లి స్పాట్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ఈ బెదిరింపుల‌కు సంబంధించి బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ కమల్ పంత్ మీడియాకు వివ‌రాలు వెల్ల‌డించారు. బెంగళూరు శివార్లలోని కొన్ని పాఠశాలలకు ఈ - మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింద‌ని తెలిపారు. స్థానికంగా ఉండే పోలీసు సిబ్బందికి అక్క‌డికి చేరుకున్నారని చెప్పారు. సోదాలు నిర్వ‌హిస్తున్నార‌ని పేర్కొన్నారు. 

స్థానిక పోలీసుల‌తో పాటు బాంబ్‌ స్క్వాడ్‌లు కూడా తనిఖీలకు వెళ్లాయని చెప్పారు. ఘ‌ట‌నా స్థ‌లంలో ఏవైనా దొరికాయా అనే మీడియా ప్ర‌శ్న‌కు క‌మిష‌న‌ర్ స‌మాధానం ఇస్తూ.. ‘‘ ఈమెయిల్ బెదిరింపుల ఆధారంగా మా సిబ్బంది స్పాట్ కు వెళ్లి తనిఖీ చేస్తున్నాయి. మరింత సమాచారం అందుబాటులోకి వచ్చిన వెంటనే మీడియాతో వెల్లడిస్తాము ’’ అని తెలిపారు. 

ఆ మెయిల్ లో ఏముందంటే ?
“ మీ పాఠశాలలో చాలా శక్తివంతమైన బాంబు అమర్చబడింది. ఇది ఒక జోక్ కాదు. మీ పాఠశాలలో చాలా శక్తివంతమైన బాంబు ఉంది. వెంట‌నే పోలీసుల‌ను, సప్పర్‌లను పిలవండి. ఆల‌స్యం చేయ‌కండి. ఇప్పుడు మీతో స‌హా వంద‌లాది మంది జీవితాలు మీ చేతుల్లో ఉన్నాయి. ’’ అని ఆ మెయిల్ లో బెదిరింపు వ‌చ్చింది. ఈ మెయిల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (DPS) బెంగళూరు ఈస్ట్, గోపాలన్ ఇంటర్నేషనల్, న్యూ అకాడమీ స్కూల్, సెయింట్ విన్సెంట్ పాల్ స్కూల్‌లకు ఉదయం 10.15 నుండి 11 గంటల మధ్య వ‌చ్చాయి. ఈ ప్ర‌తీ మెయిల్ లో ఒకే కంటెంట్ ఉంది. ఇలాంటి ఈ - మెయిల్స్ రావ‌డంతో స్కూళ్ల నిర్వాహ‌కులు భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. వెంట‌నే స్కూల్ ఆవ‌ర‌ణ‌ను ఖాళీ చేశారు. పోలీసుల‌కు స‌మాచారం అందించారు.