తాజ్‌మహల్ కు బాంబు బెదిరింపు రావడంతో టూరిస్టులను  ఆ ప్రాంతం నుండి ఖాళీ చేయించారు. బాంబు బెదిరింపులు రావడంతో తాజ్ మహల్ ను మూసివేశారు. ఈ ప్రాంతంలో పోలీసులు బాంబు కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఆగ్రా: తాజ్‌మహల్ కు బాంబు బెదిరింపు రావడంతో టూరిస్టులను ఆ ప్రాంతం నుండి ఖాళీ చేయించారు. బాంబు బెదిరింపులు రావడంతో తాజ్ మహల్ ను మూసివేశారు. ఈ ప్రాంతంలో పోలీసులు బాంబు కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

తాజ్‌మహల్ లో బాంబు పెట్టినట్టుగా గురువారం నాడు పోలీసులకు ఓ ఆగంతకుడు ఫోన్ చేశాడు.ఈ ఫోన్ రాగానే బాంబు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. తాజ్ మహల్ ను సందర్శించేందుకు వచ్చిన టూరిస్టులను అక్కడి నుండి వెంటనే తరలించారు.

Scroll to load tweet…

ఆగ్రా పోలీసులు, సీఐఎస్ఎఫ్ సిబ్బంది బాంబు కోసం గాలింపు చర్యలు చేపట్టారు.తాజ్ మహల్ ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను మూసివేశారు. తాజ్ మహల్ ను చూస్తున్న పర్యాటకులను వెంటనే అక్కడి నుండి ఖాళీ చేయించారు.

యూపీలోని ఫిరోజాబాద్ నుండి ఆగంతకుడు ఫోన్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ ఫోన్ చేసిన వ్యక్తి కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.తాజ్‌మహల్ తో పాటు చుట్టుపక్కల అన్ని ప్రదేశాలను సీఐఎస్ఎఫ్, ఆగ్రా పోలీసులు తనిఖీ చేస్తున్నారు.ఇప్పటివరకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులను గుర్తించలేదని పోలీసులు తెలిపారు.

గతంలో కూడ తాజ్ మహల్ వద్ద బాంబు ఉందని గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్లు చేశారు. ఆ సమయంలో కూడ ఈ ఫోన్ కాల్స్ ఫేక్ అని తేలింది.తాజ్ మహల్ చుట్టూ స్నిపర్ డాగ్స్ తో బాంబు కోసం గాలిస్తున్నారు.